peculiar behavior
-
భార్య మీద ప్రేమతో చర్చి పాస్టర్ విచిత్ర ప్రవర్తన
-
రోమన్ ‘బాల’రాజు లీలలు
సుదీర్ఘ చరిత్ర కలిగిన రోమన్ సామ్రాజ్యంలో వింతలూ విడ్డూరాలూ తక్కువ కాదు. రోమన్ సామ్రాజ్యాన్ని ఏలిన కాలిగ్యులా, నీరో వంటి చక్రవర్తులు తమ సుపరిపాలన వల్ల కాకుండా, విచిత్ర ప్రవర్తన కారణంగా విఖ్యాతి చెందారు. రోమన్ సామ్రాజ్యాన్ని క్రీస్తుశకం 218 నుంచి 222 వరకు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఎలగబాలస్ అనే ‘బాల’రాజు కూడా అలాంటి పిచ్చిమారాజే! ఇతగాడి అసలు పేరు మార్కస్ అలేరియస్ ఆంటోనినస్ అగస్టస్. అధికారంలోకి రావడానికి ముందు సిరియాలోని ఎమెసా పట్టణంలో పూజారిగా ఉండేవాడు. అనుకోని పరిస్థితుల్లో సెనేట్ మద్దతు కూడగట్టుకుని, పద్నాలుగో ఏటనే రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కాగలిగాడు. నిండా నాలుగేళ్లయినా అధికారంలో లేడు గానీ, పాలించిన ఆ కొన్నేళ్లూ జనాన్ని చిత్ర విచిత్రంగా కాల్చుకుతిన్నాడు. ఈ దయగల ప్రభువు ఆత్మహత్యలు చేసుకోదలచిన వారి కోసం ప్రత్యేకంగా ఒక టవర్‌ను కూడా నిర్మించాడు. మహిళల కోసం ప్రత్యేకంగా సెనేట్ ఏర్పాటు చేశాడు. విరివిగా నరబలులు ఇచ్చేవాడు. ఆ విధంగా తనకు నచ్చని వాళ్లను పరలోకానికి సాగనంపేవాడు. ఇతగాడి దాష్టీకాన్ని తట్టుకోలేని సెనేట్ పెద్దలు, సైన్యం బలవంతంగా ఈ ‘బాల’రాజును గద్దెదించారు. తిరుగుబాటుకు జడిసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని చంపేశారు. -
విచారణలో విచిత్ర ప్రవర్తన
పొంతనలేని మహేష్ సమాధానాలతో తలలు పట్టుకుంటున్న అధికారులు బెంగ ళూరు(బనశంకరి): కాడుగోడి ప్రగతి కాలేజీ హస్టల్లో విద్యార్థిని గౌతమి మతిృి కారకుడైన అటెండర్ మహేష్... విచారణ సమయంలో విచిత్రమైన సమాధానాలు ఇస్తూ పోలీస్ అధికారులకు తలనొప్పి సిృ్టస్తున్నాడు. మానసిక అస్వస్థతకు గురైన అతని ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఈ వైఖరే కాల్పులకు కారణమై ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కోరమంగళ ఏసీఎంఎం న్యాయమూర్తి ఎదుట గురువారం సాయంత్రం మహేశ్‌ను హాజరుపరిచారు. ఈ నెల 10వ తేదీ వరకు అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. విచారణ సమయంలో మహేశ్ ఇస్తున్న సమాధానాలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న మహేశ్ నుంచి నిజాలు వెలికితీయడానికి విచారణ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. కృ్ణరాజపురం వద్ద రెండేళ్ల క్రితం ఓ పనినిమిత్తం వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి తనకు రూ.2,500 పిస్తోల్ విక్రయించాడని చెబుతున్న మహేశ్ దానిని ఏ కారణం చేత కొనుగోలు చేశాడన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం లేదు. తనకు పిస్తోలు అవసరం లేదని అంటూ గుర్తుతెలియని వ్యక్తి బలవంతం చేసి అంటగట్టాడని తెలిపినట్లు తెలుస్తోంది. పిస్తోలు తీసుకెళ్లి అక్క ఇంటిలోని సూట్‌కేస్‌లో పెట్టానని తెలిపాడు. గౌతమి, శిరీషాపై కాల్పుల విషయంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాడు. కాలేజీలో తనను నిర్లక్ష్యంగా చూశారని భద్రత దృ్ట్య తాను కఠినంగా ఉంటుండడంతో ఒకసారి గౌతమి తనపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నానని అంటున్నాడు. గౌతమి తన ప్రేమను నిరాకరించి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ద్వేషం పెంచుకుని టార్గెట్ చేశానని మరోసారి తెలిపాడు. -
'నాకు బతకాలని లేదు'
అదిలాబాద్(దహెగావ్): నాకు బతకాలని లేదని కుటుంబ సభ్యులకు చెప్పి వాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దహెగావ్ మండలం అయినం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్మల సంతోష్(23) సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్న సంతోష్ సోమవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాకు బతకాలని లేదని చనిపోవాలనిపిస్తోందని చెప్పాడు. కాసేపటి తర్వాత బావి వద్ద చూసుకోండి ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టెశాడు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే బావి వద్దకు వచ్చి చూడగా బావికి దగ్గర్లో ఉన్న వాగు గట్టు వద్ద సెల్ ఫోన్‌తో పాటు సంతోష్ బట్టలు, చెప్పులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సంతోష్‌కు భార్య సునీతతో పాటు కుమారుడు కార్తీక్(3), కుమార్తె కావేరి (నాలుగు నెలల పాప) ఉన్నారు.