రోమన్ ‘బాల’రాజు లీలలు | Miracles in Roman Empire | Sakshi
Sakshi News home page

రోమన్ ‘బాల’రాజు లీలలు

Published Sun, Sep 6 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

రోమన్ ‘బాల’రాజు లీలలు

రోమన్ ‘బాల’రాజు లీలలు

సుదీర్ఘ చరిత్ర కలిగిన రోమన్ సామ్రాజ్యంలో వింతలూ విడ్డూరాలూ తక్కువ కాదు. రోమన్ సామ్రాజ్యాన్ని ఏలిన కాలిగ్యులా, నీరో వంటి చక్రవర్తులు తమ సుపరిపాలన వల్ల కాకుండా, విచిత్ర ప్రవర్తన కారణంగా విఖ్యాతి చెందారు. రోమన్ సామ్రాజ్యాన్ని క్రీస్తుశకం 218 నుంచి 222 వరకు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఎలగబాలస్ అనే ‘బాల’రాజు కూడా అలాంటి పిచ్చిమారాజే! ఇతగాడి అసలు పేరు మార్కస్ అలేరియస్ ఆంటోనినస్ అగస్టస్.

అధికారంలోకి రావడానికి ముందు సిరియాలోని ఎమెసా పట్టణంలో పూజారిగా ఉండేవాడు. అనుకోని పరిస్థితుల్లో సెనేట్ మద్దతు కూడగట్టుకుని, పద్నాలుగో ఏటనే రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కాగలిగాడు. నిండా నాలుగేళ్లయినా అధికారంలో లేడు గానీ, పాలించిన ఆ కొన్నేళ్లూ జనాన్ని చిత్ర విచిత్రంగా కాల్చుకుతిన్నాడు.

ఈ దయగల ప్రభువు ఆత్మహత్యలు చేసుకోదలచిన వారి కోసం ప్రత్యేకంగా ఒక టవర్‌ను కూడా నిర్మించాడు. మహిళల కోసం ప్రత్యేకంగా సెనేట్ ఏర్పాటు చేశాడు. విరివిగా నరబలులు ఇచ్చేవాడు. ఆ విధంగా తనకు నచ్చని వాళ్లను పరలోకానికి సాగనంపేవాడు. ఇతగాడి దాష్టీకాన్ని తట్టుకోలేని సెనేట్ పెద్దలు, సైన్యం బలవంతంగా ఈ ‘బాల’రాజును గద్దెదించారు. తిరుగుబాటుకు జడిసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని చంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement