రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కె. మహేష్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లమూడి సైదులు, పీఈటీ కస్తూరి రవీందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17,18వ తేదీల్లో ముకుందాపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ అండర్–17 విభాగంలో పెద్దదేవులపల్లి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి మహేష్ తమ చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి జట్టును ఒంటి చేతితో గెలిపించి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన విద్యార్థి మహేష్‌ను ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.