peddaiah
-
కుమారుడి హత్య కేసులో తండ్రి అరెస్టు
తాడిపత్రి రూరల్ : మతిస్థిమితం లేని కుమారుడు తరచూ తమపై దాడి చేస్తుండడంతో ఆత్మరక్షణార్థం అతన్ని కొట్టి చంపిన తండ్రిని చివరకు పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలో ఈ నెల 15న పెద్దయ్య అనే యువకుడ్ని అతని తండ్రి చిన్నభూషణ్ కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడ్ని మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. -
కొడుకు హింస భరించలేక..
తాడిపత్రి రూరల్ : కన్న కొడుకును ఓ తండ్రి కత్తితో నరికి చంపాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలోని గన్నవరిపల్లి కాలనీలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. కాలనీలో నివాసముంటున్న చిన్న భూషణ్కు పెద్దయ్య(34) అనే కుమారుడున్నాడు. పెద్దయ్యకు మతిస్థిమితం సరిగా ఉండదు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులపై దాడి చేసి హింసిస్తుంటాడు. చిన్న భూషణ్ తన కుమారుడి హింస భరించలేక చంపేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున కత్తితో నరికి దారుణంగా చంపాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలాన్ని తాడిపత్రి డీఎస్పీ సిదాసందరెడ్డి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'లక్ష'ణంగా దొరికిపోయాడు..
కర్నూలు: ప్రభుత్వ అధికారుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక సంఘటన మరువక ముందే మరో ఘటన వినిపిస్తోంది. ఎటు చూసినా అవినీతి పరులే. ఎందుకిలా పాల్పడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న పెద్దయ్య బుధవారం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రభుత్వం ఇచ్చే వేతనాలు చాలవా ? అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు.