తాడిపత్రి రూరల్ : మతిస్థిమితం లేని కుమారుడు తరచూ తమపై దాడి చేస్తుండడంతో ఆత్మరక్షణార్థం అతన్ని కొట్టి చంపిన తండ్రిని చివరకు పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలో ఈ నెల 15న పెద్దయ్య అనే యువకుడ్ని అతని తండ్రి చిన్నభూషణ్ కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడ్ని మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు.