penchikalpet village
-
వంద అడుగుల ‘కొండెంగలొద్ది’ పరుగెడుతున్న అగర్‌గూడ, గుండాల జలపాతాలు
► జాలువారే జలపాతాలు పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి దూకే జలధార ఇది. పెంచికల్పేట్ నుంచి అగర్‌గూడకు 7 కి.మీ.లు వాహనంలో వెళ్లి, మరో ఐదు కి.మీ.లు నడవాలి. తిర్యాణి మండలం గుండాల గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 50 అడుగుల కొండవాలు నుంచి జాలువారుతోంది. తిర్యాణి నుంచి 10 కి.మీ.ల దూరంలో గల రొంపల్లి వరకు వాహనాల్లో వెళ్లొచ్చు. తర్వాత దట్టమైన అడవిలో ఆరు కి.మీ.లు కాలినడకన వెళ్లాలి. -
Photo Feature: ఏయ్ బిడ్డ.. ఇది మా అడ్డా..
కుమురంభీం జిల్లా పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని అడవులను పెద్ద పులులు అడ్డాగా మార్చుకున్నాయి. పొరుగున మహారాష్ట్రలో ఉన్న తడోబా, తిప్పేశ్వర అభయరణ్యాల నుంచి వస్తున్న పులులు.. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోనిపెంచికల్పేట్ రేంజ్ పరిధిలో నిత్యం సంచరిస్తున్నాయి. గత సంవత్సరం కే8 అనే ఆడపులి పెంచికల్పేట్ రేంజ్‌ను ఆవాసంగా మార్చుకుని మూడు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక పెద్దవాగు పరీవాహక ప్రాంతంలోని సాసర్‌పిట్‌లో తన బిడ్డతో సేదతీరుతూ.. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇలా చిక్కింది. –పెంచికల్పేట్ -
జైలులో ఉండి ఎంపీటీసీగా గెలిచిన శంకర్
కమాన్‌పూర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామానికి చెందిన తాళ్ల శంకర్ జైలులో ఉండి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలుపొందారు. మండలంలోని నాగారం ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ఐదు రోజులకు శంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి నుంచి రామగుండం ఎన్టీపీసీకి వెళ్లే రైలు నుంచి బొగ్గు దొంగిలిస్తున్నాడని సెక్యూరిటీ సిబ్బంది శంకర్‌పై గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శంకర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించగా, ప్రస్తుతం ఆయన జైలులోనే ఉన్నాడు. తన భర్తను కావాలనే కొందరు జైలులో పెట్టించారని ఆరోపిస్తూ ఆయన భార్య ఒంటరిగా ప్రచారం చేసి భర్తను గెలుపించుకున్నారు. శంకర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జంగిలి అంజిపై 180 ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం.