pens
-
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
పెన్నులు తీసుకునేందుకు పోటెత్తిన విద్యార్థులు
అయినవిల్లి : అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకూ సప్తనదీజలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా విఘ్నేశ్వరస్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబులు విద్యార్థులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ పెన్నులను తీసుకునేందుకు జిల్లా నలు మూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఈ పెన్నుతో పరీక్షలు రాస్తే ఉత్తమ మార్కులు వస్తాయనేది విద్యార్థుల నమ్మకం. అందుకే ఈ పెన్నుల తీసుకునేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శించి పెన్నులు తీసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీచైర్మ¯ŒS నామన రాంబాబు స్వామికి పూజలు చేశారు. -
శ్రీవిద్యాగణపతి ప్రసాదంగా కలాల పంపిణీ
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘ఆంధ్రమహాభారతం అవరించిన నేలపై, శ్రీనాథాది మహాకవులు నడయాడిన, కవి సార్వభౌములకు ఆలవాలమైన ఈ నేలపై కలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది కనుకనే ఈ ఏడాది గణపతిని శ్రీవిద్యా గణపతిగా కలాలతో అలంకరించాం’’ అని రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పుష్కరాల రేవులో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన గణపతి విగ్రహంలో ఉపయోగించిన 1,11,111 కలాలను భక్తులకు గురువారం ప్రసాదంగా వితరణ చేశారు. విజయలక్ష్మి తల్లి సుమతి కూడా ఈ వితరణలో పాల్గొన్నారు. ఈ కలాలలను స్వీకరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పుష్కరాల రేవులో గణపతి విగ్రహం నెలకొల్పిన తావు నుంచి దాదాపు పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వరకూ భక్తులు బారులు తీరారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నగరపాలక సంస్థలో ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్, పార్టీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.