పెన్నులు తీసుకునేందుకు పోటెత్తిన విద్యార్థులు | inavilli temple pens distributions | Sakshi
Sakshi News home page

పెన్నులు తీసుకునేందుకు పోటెత్తిన విద్యార్థులు

Published Sun, Feb 5 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

inavilli temple pens distributions

అయినవిల్లి : 
అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకూ సప్తనదీజలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు నిర్వహించిన విషయం  తెలిసిందే. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా విఘ్నేశ్వరస్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబులు విద్యార్థులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ పెన్నులను తీసుకునేందుకు జిల్లా నలు మూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఈ పెన్నుతో పరీక్షలు రాస్తే ఉత్తమ మార్కులు వస్తాయనేది విద్యార్థుల నమ్మకం. అందుకే ఈ పెన్నుల తీసుకునేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శించి పెన్నులు తీసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఏ ఇబ్బందులు తలెత్తకుండా  ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీచైర్మ¯ŒS నామన రాంబాబు స్వామికి పూజలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement