- నాటకాల్ని ఆదరించాలి
- శాసన సభ స్పీకర్ కోడెల
- కందుకూరి పురస్కారాలు, నంది బహుమతుల ప్రదానం
రంగస్థలంతో చైతన్య దీప్తి
Published Mon, May 1 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
ఆది కావ్యం శ్రీకారం చుట్టుకున్న గడ్డ రాజమహేంద్రవరం..సమాజాభ్యుదయంలో తన వంతు కాంతిని ప్రసరింపజేసిన నాటకరంగపర్వానికి వేదికైంది. తెలుగునేలపై సంఘ సంస్కరణ నుంచి విభిన్న సాహిత్య ప్రక్రియల వరకూ ఎన్నింటికో ఆద్యుడైన నవయుగవైతాళికుడు కందుకూరి వీరేశలింగం పేరిట రంగస్థల కళాకారులకు విశిష్ట, ప్రతిష్టాత్మక పురస్కారాలను ఇక్కడి ఆనం కళాకేంద్రంలో ప్రదానం చేశారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 20వ నాటక పోటీల విజేతలకు నంది బహుమతులనూ అందించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు ఎందరో ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉనికి ఒడిదుడుకుల్లో చిక్కుకున్న రంగస్థలాన్ని ఆదరించాలి్సన అవసరాన్ని నొక్కి చెప్పారు.
సాక్షి, రాజమహేంద్రవరం :
రంగస్థలం ఆది నుంచీ సమాజంలో చైతన్యానికి దోహదపడిందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సినిమాలు, టీవీలు రావడంతో నాటకాలకు ఆదరణ తగ్గడం మంచిది కాదన్నారు. ప్రతి ఒక్కరూ నాటకాలను ఆదరించాలని, ఆ రంగం రక్షణకు కృషి చేయాలని సూచించారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రంగ స్థల నటులకు కందుకూరి విశిష్ట, ప్రతిష్టాత్మక పురస్కారాలు, 20వ రాష్ట్ర ప్రభుత్వ నాటకపోటీల విజేతలకు నంది నాటక బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు ఐదుగురు చొప్పున 65 మంది కళాకారులకు
కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారాలు, మరో ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేశారు. పద్య, సాంఘిక నాటకాలు, బాలలు, కళాశాలలు, యూనివర్సిటీ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న నాటక పరిషత్‌లు, కళాశాలలు, స్కూళ్లకు బంగారు, వెండి, కాంస్య నందులు, నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. నాటక రంగంలో ఉత్తమ దర్శకుడు, సంగీత దర్శకుడు, విలన్, సాంకేతిక విభాగాల వారికి అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ నాటక రంగం ద్వారానే చలనచిత్ర రంగం అభివృద్ధి చెందిందన్నారు. రంగస్థల నటులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
వృద్ధ కళాకారుల పింఛ¯ŒS రెట్టింపు చేయాలి..
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీ రామారావు హాలీవుడ్ నటుడు అయి ఉంటే ఎన్నో ఆస్కార్ అవార్డులు వచ్చేవని కొనియాడారు. సినిమా, టీవీల ప్రభావం నాటకరంగంపై పడిందన్నారు. వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే పింఛ¯ŒS రెట్టింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంగస్థల కళాకారులకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కందుకూరి వీరేశలింగం పేరుపై నటులకు ఇచ్చే పురస్కారాల ప్రదానం మొదట రాజమహేంద్రవరంలో జరగడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వీరేశలింగం తన రచనలతో సమాజాభివృది్ధకి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో శాసపమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, స్థానిక కార్పొరేటర్ జి.నరసింహారావు, ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS ఎ¯ŒS.శ్రీకాంత్, ఎండీ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర సాంస్కృతిక మండలి జిల్లా కన్వీనర్ ఎం. ఫ్రాన్సిస్, ఏఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ జె.కులశేఖర్, ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం, మధ్యలో కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Advertisement
Advertisement