- రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి
- పలువురికి స్మైల్ పురస్కారాలు ప్రదానం
అక్షరం విలువ తెలిసిన కవి స్మైల్
Published Fri, Feb 3 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
రాజమహేంద్రవరం కల్చరల్ :
భావుకతగల, అక్షరం విలువ తెలిసిన కవి స్మైల్ అని ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి కొనియాడారు. ఆయన తక్కువ రాసినా, చెప్పుకోదగ్గ ఉత్తమ రచనలు చేశారని చెప్పారు. లా హాస్పి¯ŒS హోటల్లో శుక్రవారం స్మైల్ అభిమానులు, మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన స్మైల్ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. కాళిదాసు రచించిన కుమార సంభవంలో వర్ణనలతో సరితూగగల వర్ణనలు స్మైల్ కవిత్వంలో కనిపిస్తాయని చెప్పారు. అనంతరం సాహితీవేత్త వెలమాటి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. కవితా రంగంలో ప్రసాదమూర్తి, మువ్వా శ్రీనివాసరావులకు, కథా రచనలో రహమతుల్లా, మానస ఎండ్లూరిలకు స్మైల్ సాహితీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ దిగంబర కవి నగ్నముని, సాహితీవేత్త వేణుగోపాలరెడ్డి స్మైల్ సాహితీ సేవలను కొనియాడారు. స్మైల్ తనయుడు ఖాదర్ మొహిద్దీన్, బొమ్మూరు సాహిత్యపీఠం డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్, పర్యావరణవేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, చెలికాని స్టాలిన్, రెంటాల వెంకటేశ్వరరావు, ‘సాహితీగౌతమి’ విజయకుమార్, ప్రజాపత్రిక సుదర్శ¯ŒS దంపతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement