ఆమెకు ‘షీ’ల్డ్
-
షీ టీమ్‌లతో ఆకతాయిల ఆట కట్టు
-
ఆరు నెలల కాలంలోనే 990 మందికి కౌన్సిలింగ్
-
10 మంది పై కేసులు
-
రాష్ట్ర డీజీపీ సాంబశివ రావుతో ప్రసంశలు అందుకుంటున టీమ్ సభ్యులు
రాజమహేంద్రవరం క్రైం :
రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా పరిధిలో పాఠశాల, కళాశాలల విదార్థినుల రక్షణకు ఏర్పాటు చేసిన ‘షీటీమ్’లు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. అర్బన్ జిల్లా ఎస్పీగా బి.రాజకుమారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మహిళల రక్షణే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్‌ఐలు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు పని చేసే ఈ టీమ్‌లు నగరంలో కళాశాలలు, పాఠశాలలల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఉండి మహిళలు, విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించే ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. వారిని మహిళా పోలీస్ స్టేష¯ŒSకు తరలించి మహిళా వేధింపులు, చట్టాలపై అవగాహన కల్పిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోని ఆకతాయిలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మరో సారి కౌన్సెలింగ్ ఇస్తారు. అయినప్పటికీ వేధింపులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తారు.
ఆరు నెలల్లో వెయ్యి కేసులు
షీటీమ్ ఏర్పాటైన ఆరు నెలల్లో వెయ్యి కేసులు నమోదయ్యాయి. వీటిలో 990 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు. కౌన్సెలింగ్‌లోనే ఆకతాయిల్లో మార్పు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలకు భంగం వాటిల్ల కుండా చట్టాలపై అవగాహన కల్పించి వారిలో మార్పు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
డీజీపీతో పురస్కారం
రాష్ట్ర డీజీపీ సాంబశివరావు, గత నెల 19న రాజమహేంద్రవరంలో లాçహాస్పి¯ŒS హాటల్‌లో రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంగా షీ టీమ్ తీరును ప్రశంసిస్తూ ఒకొక్క టీమ్‌కు రూ.3 వేలు చొప్పున నగదు పురస్కారం అందజేశారు.
విద్యార్థినులకు మహిళా చట్టాలపై అవగాహన
ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ విద్యా సంస్థల్లోని మహిళలకు కరపత్రాలు, సమావేశాల ద్వారా మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారు ఎదుర్కొనే ఇబ్బందిపై ధైర్యంగా ఫిర్యాదు చేసేలా ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నారు.
విద్యార్థినులపై వేధింపులు ఆగాయి
షీ టీమ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి నగరంలో వివిధ కళాశాలల వద్ద విద్యార్థినులపై ఆకతాయిల వేధింపులు ఆగాయి. ముఖ్యంగా కౌన్సెలింగ్ ద్వారానే మార్పు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
– బి.రాజకుమారి, రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ