distributions
-
ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్
దీర్ఘకాలంలో మంచి నిధిని సమకూర్చుకోవాలని ఆశించే వారు పరిశీలించ తగిన పథకాల్లో ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్ కూడా ఒకటి. సెబీ ఆదేశాలకు పూర్వం ఈ పథకం పేరు ‘ఇన్వెస్కో ఇండియా గ్రోత్’గా ఉండేది. సెబీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మార్పులు, చేర్పులకు ఆదేశించిన నేపథ్యంలో ఈ పథకం పెట్టుబడుల విధానమూ మారిపోయింది. గతంలో మల్టీక్యాప్ ఫండ్‌గా ఉన్న ఇది ఎక్కువగా లార్జ్‌క్యాప్‌లో 70–80 శాతం పెట్టుబడులు పెట్టేది. ఇప్పుడు మార్పుల నేపథ్యంలో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్‌గా మారిపోయింది. అంటే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున కనీసం ఇన్వెస్ట్ చేయాలి. గత కొన్ని నెలలుగా ఈ పథకం తన పోర్ట్‌ఫోలియోకు మార్పులు చేసింది. మిడ్‌క్యాప్ విభాగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఫిబ్రవరి నుంచి చూస్తే మిడ్‌క్యాప్స్‌లో 27–34 శాతం మధ్య పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం ప్రామాణిక సూచీ బీఎస్ఈ 100 నుంచి బీఎస్ఈ 250గా మారిపోయింది. పెట్టుబడుల విధానం ఈ పథకం గతంలో స్టాక్స్ ఎంపికకు బాటమ్ అప్ విధానాన్ని అనుసరించేది. మారిన సమీకరణాల నేపథ్యంలో బాటమ్ అప్, టాప్డౌన్ విధానాలను అనుసరించనుంది. ఆయా రంగాలకు సంబంధించిన అంశాలతో పని లేకుండా స్టాక్స్‌వారీగా ఎంపిక విధానం నుంచి, ఆర్థిక, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్టాక్స్ ఎంపికగా విధానం మారిపోయింది. అయినప్పటికీ ఈ పథకం మెరుగైన రాబడులను ఇస్తుందన్న అంచనా ఉంది. స్టాక్స్ ఎంపికలో మంచి ట్రాక్ రికార్డు, అన్ని కాలాల్లోనూ మంచి రాబడులను అందించిన పథకం కావడమే ఈ అంచనాలకు బలం. అధిక రిస్క్ తీసుకునే వారు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నా ఫర్వాలేదనుకునే వారు ఈ పథకాన్ని నిస్సంకోచంగా ఎంచుకోవచ్చు. గత పనితీరు ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు నూతన ప్రామాణిక సూచీ అయిన బీఎస్ఈ 250తో పోలిస్తే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్ 17.9 శాతం వార్షిక రాబడులను ఇస్తే, ప్రామాణిక సూచీ రాబడులు 14.9 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు 11.3 శాతం అయితే, ప్రామాణిక సూచీ రాబడులు 11.8 శాతం. ఐదేళ్ల కాలంలో ఈ పథకం 18.7 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇవ్వగా, ప్రామాణిక సూచీ రాబడులు 17.3 శాతంగా ఉన్నాయి. అంటే కేటగిరీని మించి రాబడులను అందించినట్టు తెలుస్తోంది. పథకం కింద ఉన్న నిధుల్లో 95 శాతాన్ని ఇన్వెస్ట్ చేసి నగదు నిల్వలను తక్కువే ఉంచుకుంది. 20 రంగాల నుంచి సుమారు 41 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. బ్యాంకింగ్ రంగానికి ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. 24 శాతం ఎక్స్పోజర్ కలిగి ఉంది. ఫైనాన్స్, పెట్రోలియం, సాఫ్ట్వేర్ రంగాల్లోనూ చెప్పుకోతగ్గ ఎక్స్పోజర్ తీసుకుంది. -
రంగస్థలంతో చైతన్య దీప్తి
నాటకాల్ని ఆదరించాలి శాసన సభ స్పీకర్ కోడెల కందుకూరి పురస్కారాలు, నంది బహుమతుల ప్రదానం ఆది కావ్యం శ్రీకారం చుట్టుకున్న గడ్డ రాజమహేంద్రవరం..సమాజాభ్యుదయంలో తన వంతు కాంతిని ప్రసరింపజేసిన నాటకరంగపర్వానికి వేదికైంది. తెలుగునేలపై సంఘ సంస్కరణ నుంచి విభిన్న సాహిత్య ప్రక్రియల వరకూ ఎన్నింటికో ఆద్యుడైన నవయుగవైతాళికుడు కందుకూరి వీరేశలింగం పేరిట రంగస్థల కళాకారులకు విశిష్ట, ప్రతిష్టాత్మక పురస్కారాలను ఇక్కడి ఆనం కళాకేంద్రంలో ప్రదానం చేశారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 20వ నాటక పోటీల విజేతలకు నంది బహుమతులనూ అందించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు ఎందరో ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉనికి ఒడిదుడుకుల్లో చిక్కుకున్న రంగస్థలాన్ని ఆదరించాలి్సన అవసరాన్ని నొక్కి చెప్పారు. సాక్షి, రాజమహేంద్రవరం : రంగస్థలం ఆది నుంచీ సమాజంలో చైతన్యానికి దోహదపడిందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సినిమాలు, టీవీలు రావడంతో నాటకాలకు ఆదరణ తగ్గడం మంచిది కాదన్నారు. ప్రతి ఒక్కరూ నాటకాలను ఆదరించాలని, ఆ రంగం రక్షణకు కృషి చేయాలని సూచించారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రంగ స్థల నటులకు కందుకూరి విశిష్ట, ప్రతిష్టాత్మక పురస్కారాలు, 20వ రాష్ట్ర ప్రభుత్వ నాటకపోటీల విజేతలకు నంది నాటక బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు ఐదుగురు చొప్పున 65 మంది కళాకారులకు కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారాలు, మరో ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేశారు. పద్య, సాంఘిక నాటకాలు, బాలలు, కళాశాలలు, యూనివర్సిటీ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న నాటక పరిషత్‌లు, కళాశాలలు, స్కూళ్లకు బంగారు, వెండి, కాంస్య నందులు, నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. నాటక రంగంలో ఉత్తమ దర్శకుడు, సంగీత దర్శకుడు, విలన్, సాంకేతిక విభాగాల వారికి అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ నాటక రంగం ద్వారానే చలనచిత్ర రంగం అభివృద్ధి చెందిందన్నారు. రంగస్థల నటులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వృద్ధ కళాకారుల పింఛ¯ŒS రెట్టింపు చేయాలి.. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీ రామారావు హాలీవుడ్ నటుడు అయి ఉంటే ఎన్నో ఆస్కార్ అవార్డులు వచ్చేవని కొనియాడారు. సినిమా, టీవీల ప్రభావం నాటకరంగంపై పడిందన్నారు. వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే పింఛ¯ŒS రెట్టింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంగస్థల కళాకారులకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కందుకూరి వీరేశలింగం పేరుపై నటులకు ఇచ్చే పురస్కారాల ప్రదానం మొదట రాజమహేంద్రవరంలో జరగడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వీరేశలింగం తన రచనలతో సమాజాభివృది్ధకి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో శాసపమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, స్థానిక కార్పొరేటర్ జి.నరసింహారావు, ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS ఎ¯ŒS.శ్రీకాంత్, ఎండీ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర సాంస్కృతిక మండలి జిల్లా కన్వీనర్ ఎం. ఫ్రాన్సిస్, ఏఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ జె.కులశేఖర్, ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం, మధ్యలో కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. -
పెన్నులు తీసుకునేందుకు పోటెత్తిన విద్యార్థులు
అయినవిల్లి : అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకూ సప్తనదీజలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా విఘ్నేశ్వరస్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబులు విద్యార్థులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ పెన్నులను తీసుకునేందుకు జిల్లా నలు మూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఈ పెన్నుతో పరీక్షలు రాస్తే ఉత్తమ మార్కులు వస్తాయనేది విద్యార్థుల నమ్మకం. అందుకే ఈ పెన్నుల తీసుకునేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శించి పెన్నులు తీసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీచైర్మ¯ŒS నామన రాంబాబు స్వామికి పూజలు చేశారు. -
పాత పద్ధతిలోనే పింఛన్లు
వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా పంపిణీకి చర్యలు డీఆర్డీ ఏ నుంచి ఎంపీడీఓలకు ఆదేశాలు కాకినాడ సిటీ / రాయవరం: జిల్లాలో సామాజికభద్రతా పింఛన్లను పాత పద్ధతిలోనే వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా జనవరి నెల నుంచి పంపిణీ చేయనున్నారు. 50 రోజుల క్రితం రూ.500, రూ.1000 నోట్లు రద్దుతో ఏర్పడ్డ నగదు కొరత నేపథ్యంలో ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం లబ్ధిదారులకు ప్రతీనెల ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును నగదు రూపంలో చెల్లించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. నేరుగా లబ్ధిదారులకు పింఛను సొమ్మును ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాలకు వేయాలని నిర్ణయించిందే తడువుగా ఇక్కట్లను అంచనా వేయకుండా డిసెంబర్ ఒకటిన లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,75,823 మంది లబ్ధిదారుల్లో 4,48,640 మంది వృద్ధులు, వితంతువులు, చేనేత, కలుగీత, అభయహస్తం, దివ్యాంగుల్లో కొందరికి రూ.వెయ్యి చొప్పున, మరో 27,183 మంది దివ్యాంగులకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉండగా రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం, రూ.100 నోట్లు కొరత ఉన్నందున బ్యాంకు ఖాతాలో వేసిన సొమ్ము లబ్ధిదారులకు అందక, చేతిల్లో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. తమఖాతాల్లో వేసిన సొమ్మును తీసుకునేందుకు పింఛనుదారులు బ్యాంకుల వద్ద గంటల తరబడి లైన్లలో నిల్చున్నా నగదు కొరతతో చేతికందని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు అధికారులు 15 రోజుల తరువాత క్షేత్రస్థాయిలో స్వైపింగ్ మెషీన్లతో వివిధ బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా పింఛన్ల సొమ్ము పంపిణీకి చర్యలు తీసుకోడంతో ఈ పంపిణీ ప్రక్రియ నెల పొడవునా సాగి బుధవారం 28వ తేదీతో ముగిసింది. ఈ నెలలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వెల్లువెత్తిన వ్యతిరేకతతో ప్రభుత్వం జనవరిలో యథావిధిగా పాత పద్ధతిలోనే పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు జనవరి నెలకు విడుదలైన సామాజిక పింఛన్ల సొమ్మును బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంపీడీవోల ఖాతాలకు పంపించారు. ఆయా మండలాల అధికారులు నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి గ్రామాల్లో ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నగదు సిద్ధం చేయండి.. 2017 జనవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పథకంలో పింఛన్లు ట్యాబ్‌ల ద్వారా ఇవ్వనున్న నేపథ్యంలో అవసరమైన నగదు సిద్దం చేయాలని బ్యాంకులకు ఎంపీడీవోలు సమాచారం పంపించారు. ఈ నెల 28వ తేదీకి ఆయా బ్యాంకు శాఖల పరిధిలో అవసరమైన సొమ్మును సిద్ధం చేయాలని ఎంపీడీవోలు వారి పరిధిలోని బ్యాంకులకు సమాచారం అందించారు. దీని ప్రకారం జిల్లాలో ఉన్న 750 బ్యాంకు శాఖల ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసే పింఛన్ సొమ్ము రూ.52కోట్లు ఈ నెలాఖరుకు బ్యాంకు అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. -
శ్రీవిద్యాగణపతి ప్రసాదంగా కలాల పంపిణీ
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘ఆంధ్రమహాభారతం అవరించిన నేలపై, శ్రీనాథాది మహాకవులు నడయాడిన, కవి సార్వభౌములకు ఆలవాలమైన ఈ నేలపై కలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది కనుకనే ఈ ఏడాది గణపతిని శ్రీవిద్యా గణపతిగా కలాలతో అలంకరించాం’’ అని రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పుష్కరాల రేవులో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన గణపతి విగ్రహంలో ఉపయోగించిన 1,11,111 కలాలను భక్తులకు గురువారం ప్రసాదంగా వితరణ చేశారు. విజయలక్ష్మి తల్లి సుమతి కూడా ఈ వితరణలో పాల్గొన్నారు. ఈ కలాలలను స్వీకరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పుష్కరాల రేవులో గణపతి విగ్రహం నెలకొల్పిన తావు నుంచి దాదాపు పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వరకూ భక్తులు బారులు తీరారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నగరపాలక సంస్థలో ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్, పార్టీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.