Performance watchfires
-
సీఎం పర్యటన మళ్లీ వాయిదా
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబునాయుడు పర్యటన మరోసారి వాయిదాపడింది. హుదూద్ తుఫాన్ అనంతరం వారం రోజుల పాటు విశాఖలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించిన చంద్రబాబు ఆ తర్వాత 22న విశాఖలో కాగడాల ప్రదర్శనలో పాల్గొన్నారు. గత నెల 31న మళ్లీ పర్యటించి సహాయక చర్యల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షిస్తారని అధికారులు భావించారు. అదేరోజున తుఫాన్ పునరావాసకార్యక్రమాల్లో అత్యుత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందిని సన్మానించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. దీనిని మంత్రులు అధికారికంగా ప్రకటించారు. ఆ పర్యటన రద్దయింది. నవంబర్ 10న 15 నిమిషాల్లో విశాఖ అంతటా పదిలక్షల మొక్కలునాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది. దీనికి సీఎంతో పాటు పలువురు కేంద్ర,రాష్ర్టమంత్రులు పాల్గొంటారని రాష్ర్టమున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఈమేరకు మూడు రోజుల పాటు సమీక్షలు నిర్వహించారు. కానీ సీఎం పర్యటన మరోసారి వాయిదా పడినట్టు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. సొంత పనుల నిమిత్తం కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ జానికిలు వారం రోజుల పాటు సెలవు పెట్టారు. ఇద్దరూ నేరుగా సీఎంతోనే మాట్లాడి సెలవు పొందినట్టు సమాచారం. ఈ నెల 12న సింగపూర్ వెళ్తున్న సీఎం బాబు కూడా విశాఖ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలిసిం ది. చ్చింది. సింగపూర్ నుంచి వచ్చాక 17న విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. -
మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలి
జిల్లా కేంద్ర సాధన సమితి డిమాండ్ మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలోలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని జికేఆర్ గార్డెన్స్ నుంచి ప్రధాన రహదారిపై కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మల్కాజి సత్యనారాయణ మాట్లాడుతూ ఎప్పటి నుంచే మెదక్ పట్టణం వెనుకబాటుకు గురవు తోందన్నారు. నిజాం కాలం నుంచే విముక్తి కోరుతూ మెదక్ ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారన్నారు. సొంత రాష్ట్రంలోను మెదక్ పట్టణం అణిచివేతకు గురవుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ కేంద్రంగా ప్రత్యేకజిల్లా ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా సాధన సమితి సభ్యులు ఎంఎల్ఎన్ రెడ్డి, అఫ్జల్, మహేందర్‌రెడ్డి, హర్కార్ మహిపాల్, గూడూరి అరవింద్‌గౌడ్, శ్రీకాంత్, విష్ణువర్ధన్‌గౌడ్, గోపిచంద్, సాయిరాం పాల్గొన్నారు.