జిల్లా కేంద్ర సాధన సమితి డిమాండ్
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలోలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని జికేఆర్ గార్డెన్స్ నుంచి ప్రధాన రహదారిపై కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మల్కాజి సత్యనారాయణ మాట్లాడుతూ ఎప్పటి నుంచే మెదక్ పట్టణం వెనుకబాటుకు గురవు తోందన్నారు.
నిజాం కాలం నుంచే విముక్తి కోరుతూ మెదక్ ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారన్నారు. సొంత రాష్ట్రంలోను మెదక్ పట్టణం అణిచివేతకు గురవుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ కేంద్రంగా ప్రత్యేకజిల్లా ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా సాధన సమితి సభ్యులు ఎంఎల్‌ఎన్ రెడ్డి, అఫ్జల్, మహేందర్‌రెడ్డి, హర్కార్ మహిపాల్, గూడూరి అరవింద్‌గౌడ్, శ్రీకాంత్, విష్ణువర్ధన్‌గౌడ్, గోపిచంద్, సాయిరాం పాల్గొన్నారు.
మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలి
Published Fri, Sep 19 2014 12:12 AM | Last Updated on Mon, Oct 8 2018 7:44 PM
Advertisement
Advertisement