District center
-
వర్ధన్నపేటను జిల్లా కేంద్రం చేయాలి
వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ గాడిపెల్లి రాజేశ్వర్‌రావు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల యాకయ్య, వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి అన్నారు. వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఆరోరోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలను పునర్విభజనలో ఎవరూ కోరని హన్మకొండ జిల్లా ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకొని, వరంగల్ అర్బన్, రూరల్ పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాగా చేయాలనుకుంటే , దాని స్థానంలో వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో 42 ఎకరాల ప్రభుత్వ భూమి, తాత్కాలిక కార్యాలయాలకు ఆర్అండ్బీ అతిథిగృహం, 16 ఎకరాల విస్తీర్ణంలో ఎంపీడీఓ కార్యాలయం, సువిశాలమైన పోలీస్‌స్టేన్ ఉన్నాయని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మామునూరు ఎయిర్‌పోర్టు, వెటర్నరీ యూనివర్సిటీ, ఏనుమాముల మార్కెట్ ఉన్నాయని, 20 కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ఉందని, తాజాగా టెక్స్టైల్ పార్క్ మంజూరైందన్నారు. వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారి జాతీయ రహదారిగా మారి త్వరలో ఫోర్‌లైన్‌గా అభివృద్ధి చెందనుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీక్షలో అఖిలపక్ష నాయకులు మార్త సారంగపాణి, తూళ్ల కుమారస్వామి, రామగిరి అనిల్, కొండేటి సత్యం, నాంపెల్లి యాకయ్య, నరుకుడు వెంకటయ్య, సిలువేరు కుమారస్వామి, నాగెల్లి సురేష్, కొండేటి శ్రీనివాస్, ఐత యాకాంతం కొండేటి మహేందర్, కంజర్ల మహేష్, ఎలికట్టె ముత్తయ్య పాల్గొన్నారు. -
భద్రాద్రి జిల్లా కోసం..
- ఊపందుకున్న ఉద్యమం - రౌండ్‌టేబుల్ సమావేశం - ఏకమైన రాజకీయ పక్షాలు భద్రాచలం : భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదివారం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు గిరిజన, దళిత, వర్తక,వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రముఖులు సుమారు 500 మంది పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో భద్రాచలానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయటంతో ఆ ప్రభావం భద్రాచలంపై తీవ్రంగా పడిందన్నారు. ఏజెన్సీ కేంద్రంతో పాటు, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి క్షేత్రం వెలసిన భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తేనే భవిష్యత్ ఉంటుందన్నారు. దీన్ని సాధించుకునేందుకు.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమబాట పడతామన్నారు. పార్టీలకతీతంగా చేపట్టే ఆందోళనకు గ్రామస్థాయిలో ప్రజానీకాన్ని కదిలిస్తామన్నారు. ఇందుకోసమని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో విలీనమైన ముంపు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపి భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేయూలని కొందరు, అది కాని పక్షంలో భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. తాడో పేడో తేల్చుకోవాలి భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించుకునేలా రాజకీయ పార్టీలకతీతంగా అంతా ఏకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ద్వారా ప్రభుత్వం దృష్టికి భద్రాద్రి వాసుల అభిప్రాయూన్ని తీసుకెళ్లాలని నిర్ణరుుంచారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
కాకినాడకు కొత్త యోగం!
- స్మార్ట్సిటీపై నగరవాసుల ఆశలు - ఎంపికైతే కార్పొరేషన్‌కు నిధుల వరద - ఏటా రూ.500 కోట్ల కేంద్ర గ్రాంటు కాకినాడ : రేవు కార్యకలాపాలు, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రం కాకినాడను ‘స్మార్ట్‌సిటీ’ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయం నగరవాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రానున్న రోజుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉన్న కాకినాడకు ఈ ప్రాజెక్టు దక్కితే నిధుల వరద పారనుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఎలాంటి పథకానికైనా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు అందే అవకాశం ఉందని, అన్నీ కలిసి వస్తే ఏటా రూ.500 కోట్ల వరకు ఐదేళ్ళపాటు నిధులు మంజూరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌నుంచి మూడు నగరాలకు ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు విశాఖ, తిరుపతితోపాటు కాకినాడ నగరాన్ని కూడా ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. దాదాపు 15 అంశాలను కొలమానంగా తీసుకుని ఈ మూడు నగరాలను ఎంపిక చేసినప్పటికీ కేంద్రస్థాయిలో తుది నిర్ణయం తీసుకునేందుకు గురువారం ప్రతిపాదనలు పంపారు. ఎంపికకు ఇదీ కొలమానం.. స్మార్ట్‌సిటీ ఎంపికకు సంబంధించి సుమారు 15 అంశాలను కొలమానంగా తీసుకున్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, ఇ-గవర్నెన్స్, గ్రీవెన్స్ పరిష్కారం, ఆదాయవ్యయాలు, ఖర్చుకు తగ్గ ఆదాయం వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ప్రధానంగా 90 శాతం పైగా పన్నుల వసూళ్ళతోపాటు క్రమం తప్పని ఆడిట్, సకాలంలో జీతాల చెల్లింపు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపికైతే ఇవీ లాభాలు.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికైతే కాకినాడకు భారీస్థాయిలో వనరులు సమకూరనున్నాయి. ప్రధానంగా ఏడాదికి రూ.500 కోట్ల వరకు కేంద్రంనుంచి నిధులు అందే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే అదంతా గ్రాంటా? నగరపాలక సంస్థ భాగస్వామ్యం కూడా ఉండాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టుకు ఎంపికైతే కాకినాడ మరింత ప్రగతిపథంలో పయనిస్తుందంటున్నారు. అయితే కేంద్రస్థాయిలో తుది నిర్ణయం వెలువడేందుకు సమయం పడుతుందని కార్పొరేషన్వర్గాలు చెబుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనల దశల్లో ఉన్న కాకినాడ స్మార్ట్సిటీపై ప్రభుత్వం ప్రత్యేకటాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసింది. కలెక్టర్ చైర్మన్‌గా, నగర పాలక సంస్థ కమిషనర్ మెంబర్ క న్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో జిల్లా ఎస్పీ, జాతీయ రహదారుల విభాగం, ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ, రవాణా, రహదారులు, భవనాలు, వివిధశాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరంతా పథకాన్ని సమర్థంగా అమలు చేసే అంశంపై సమన్వయం చేయనున్నారు. -
జిల్లా కేంద్రంగా కామారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కార్యాలయాలకు అవసరమైన స్థలాలను చూడాలని కూడా విప్ గోవర్ధన్‌కు సూచించారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆస్తులను స్వాధీ నం చేసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికీ అంగీకరించారు. కామారెడ్డి: కామారెడ్డివాసుల చిరకాల కోరిక తీరబోతోంది. జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారి తో మాట్లాడుతూ జిల్లాలో మరో మూడు అ సెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని, ఆరు నియోజకవర్గా లకో జిల్లా చొప్పున రెండు జిల్లాలను చేస్తామన్నారని పేర్కొన్నారు. కామారెడ్డిలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను అధికారులతో కలిసి చూడాలని కూడా స్థానిక ఎమ్మెల్యే గోవర్ధన్‌కు సీఎం సూచించారు.అంతకు ముం దు వారు కామారెడ్డిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరి ణామాలను సీఎంకు వివరించారు. కాలేజీ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు మేనేజ్మెంట్ కమి టీ ముందుకు వస్తున్నందున వారిని ఆహ్వాని ద్దామని సీఎం పేర్కొన్నారని జేఏసీ నేతలు తెలిపారు. కాలేజీ ఆస్తులన్నింటినీ స్వాధీనం చే సుకుని, కేజీ నుంచి పీజీ విద్యాపథకాన్ని అమలు చేయడంలో భాగంగా అక్కడ ప్రభుత్వ వి ద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సుమారు గంటపాటు సీఎం వా రితో మాట్లాడారు. త్వరలోనే కామారెడ్డికి వ చ్చి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారన్నా రు. సీఎంను కలిసినవారిలో జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం,కొమ్ముల తిర్మల్‌రెడ్డి, డాక్టర్ వి. శంకర్, వీఎల్ నర్సింహారెడ్డి, క్యాతం సిద్ధరా ములు,వెకంట్రాంరెడ్డి, విద్యార్థి సంఘాల నేత లు బాలు, ఆజాద్, దశరథ్, రవీందర్, భాను, అరుణ్, నరేశ్, జబ్బార్ తదితరులున్నారు. -
జిల్లా కేంద్ర సాధనకోసం వినూత్న నిరసన
మేకులపై పడుకొని దీక్ష చేపట్టిన గోవింద్రాజ్ మెదక్‌టౌన్: మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధి గోవింద్రాజ్ ఆరుగంటలపాటు మేకులతో కూడిన చెక్కపై పడుకొని వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలో జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు బుధవారం 77వ రోజుకు చేరాయి. బుధవారం దీక్షల సందర్భంగా జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధి గోవిందరాజ్ సుమారు ఆరుగంటలపాటు మేకులపై పడుకొని తన ఆకాంక్షను చాటాడు. రిలేదీక్షలకు టీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించి, గోవిందరాజ్ చేపట్టిన నిరసనను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్ర ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన స్పష్టంగా లేదన్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణను గురువారం మెదక్ ఖిల్లాపై సమావేశం నిర్వహించి ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధులు మల్కాజి సత్యనారాయణ, దమ్ము యాదగిరి, మామిళ్ల ఆంజనేయులు, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణిలో ఒకే ఒక్కడు
- తక్కువ సంఖ్యలో అధికారుల హాజరు - కొందరు మధ్యలో నుంచి నిష్ర్కమణ - వినతులు స్వీకరించిన జడ్పీ సీఈఓ రాజారాం ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 182 వినతులు వచ్చాయి. తక్కువ సంఖ్యలో అధికారులు హాజరయ్యారు. ఇందులో నుంచి కొంతమంది అధికారులు మధ్యలో నుంచి నిష్ర్కమించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను జడ్పీ సీఈఓ రాజారాం స్వీకరించారు. జడ్పీ సీఈఓ మధ్యాహ్నం కూడా అధికారుల హాజరును పరిశీలించగా, సగం మంది అధికారులు కూడా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని, ఏదో ప్రజావాణికి తూతూ మంత్రంగా వచ్చి మధ్యలో నుంచి నిష్ర్కమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోండి అసలే రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న తమపై వీడీసీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామ గీత పారిశ్రామిక కుటుంబాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. వీడీసీకి ఈ సంవత్సరం వ్యాపారాలు లేక డబ్బులు చెల్లించలేకపోతున్నామని చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తాము గీసిన కల్లును పారబోస్తూ, దుకాణాలకు తాళాలు వేశారన్నారు. వారి దౌర్జాన్యాలను అరికట్టాలని కోరారు. -
మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలి
జిల్లా కేంద్ర సాధన సమితి డిమాండ్ మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలోలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని జికేఆర్ గార్డెన్స్ నుంచి ప్రధాన రహదారిపై కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మల్కాజి సత్యనారాయణ మాట్లాడుతూ ఎప్పటి నుంచే మెదక్ పట్టణం వెనుకబాటుకు గురవు తోందన్నారు. నిజాం కాలం నుంచే విముక్తి కోరుతూ మెదక్ ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారన్నారు. సొంత రాష్ట్రంలోను మెదక్ పట్టణం అణిచివేతకు గురవుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ కేంద్రంగా ప్రత్యేకజిల్లా ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా సాధన సమితి సభ్యులు ఎంఎల్ఎన్ రెడ్డి, అఫ్జల్, మహేందర్‌రెడ్డి, హర్కార్ మహిపాల్, గూడూరి అరవింద్‌గౌడ్, శ్రీకాంత్, విష్ణువర్ధన్‌గౌడ్, గోపిచంద్, సాయిరాం పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రం కానున్నవికారాబాద్
వికారాబాద్: వికారాబాద్ ప్రాంతానికి ప్రస్తుతం మహర్దశ మొదలైంది. ఇప్పటికే కాసుల వర్షం ప్రారంభమైంది. రానున్నకాలం మరింత దేదీప్యమానం కానుందని ఈ ప్రాంతీయులు ఆకాంక్షిస్తున్నారు. వికారాబాద్ పట్టణం జిల్లాకేంద్రం కావడం దాదాపుగా ఖరారవడంతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. ముఖ్యంగా భూముల ధరలు అమాంతం ఆకాశానికి అంటుతున్నాయి. గతంలో ధరలతో పోలిస్తే ప్రస్తుతం భూముల ధరలు రెండుమూడు రెట్లు పెరిగిపోయాయి. పట్టణానికి 15 కిలోమీటర్ల వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్ల స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలాచోట్ల సాగుభూముల్ని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 కిలో మీటర్ల వరకు పట్టణం విస్తరించింది.ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని అనంతగిరి గుట్ట మొదలు కొని హైదరాబాద్ వైపు,కొత్తగడి మొదలుకొని పరిగి వైపు వెళ్ళే దారి వెంట లే అవుట్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. పలువురు వ్యాపారులు,ఉద్యోగులు,ధనవంతులు,మధ్యతరగతి వర్గాలు ఇళ్ల స్థలాలు, ఫాంహౌజ్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఈ ప్రాంతంలో పట్టాభూములు దొరకని పరిస్థితి నెలకొంది. శాటిలైట్‌టౌన్ ఊతం... నెల కిందట శాటిలైట్టౌన్కు సంబంధించిన పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించడంతో పాటు మంజీరానీరు వికారాబాద్‌కు ఇటీవల రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు అనంతగిరి పర్యాటక కేంద్రం అభివృద్ధి జరగడం, జాతీయ ప్రిజన్ అకాడమీ, జిల్లా జైలు, ఆల్ట్రామోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం, జిల్లా కోర్టు, రూర ల్ చిన్న తరహా పరిశ్రమల యువకుల వృత్తి విద్యా శిక్షణ కే ంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వికారాబాద్‌కు మంజూరవడం వల్ల కూడా ఇక్కడ సందడి పెరిగింది. జిల్లాకేంద్రంగా మారను న్న వికారాబాద్‌లో కొన్ని పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే మూడేళ్ల క్రితం ఎకరానికి రూ.5 నుంచి 10 లక్షల ధర ఉండగా ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి 90 లక్షలకు చేరింది. రాన్రాను భూముల ధరలు అందుబాటులో లేకుండా పోవడంతో రియల్టర్లు సైతం గ్రూపులుగా ఏర్పడి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. స్థానికులతో పాటు హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, తాండూర్, జహీరాబాద్, సంగారెడ్డి, చేవెళ్ల తదితర ప్రాంతాలకు చెందిన పలువురు రియల్టర్లు ఇక్కడ భూముల్ని కొనుగోలు చేస్తున్నారు. క్రమంగా పట్టణంలో ప్రధాన దారుల వెంట ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్విమింగ్‌పూల్స్, కళాశాలలు, కల్యాణ మండపాలు ఏర్పాటవుతున్నాయి. పనికిరాని పోరంబోకు భూమి సైతం ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. -
వివాదానికి తెర
సుభాష్‌నగర్: కొంత కాలంగా జిల్లా కేంద్రంలోగల ఈద్గా స్థలంపై నెలకొన్న వివాదానికి తెరపడింది. నగరంలోని శాంతినగర్ వద్ద గల పాత ఈద్గాకు చెందిన రెండు ఎకరాల 31గుంటల స్థలం విషయం కొంత కాలం గా వివాదంలో ఉంది. ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించారని పలు ఆరోపణలు వెల్లు వెత్తాయి. దీంతో గత 40 సంవత్సరాలుగా ఈ సమస్య సమస్యగానే మిగిలి పోయింది. పరిష్కారానికి నోచుకోలేదు. రానురాను ఈద్గా స్థలం తగ్గిపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయంపై ఎన్నోసార్లు సర్వేలు చేయాలని కొందరు, సర్వేలను నిలిపి వేయాలని మరి కొందరు ఆందోళన లు చేశారు. దీంతో ఆ స్థలం విషయంలో ఎ న్నోసార్లు సర్వేల కోసం అధికారులకు దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు.అయినప్పటికీ ఈద్గాకు చెందిన స్థల వివాదం సమసిపోలేదు. అయితే నగరానికి చెందిన ఇద్రీస్ అనే వ్యాపారి ఈద్గా పక్కన గల లక్షల వి లువ చేసే భూమిని కొనుగోలు చేసి ఈద్గా కోసం అప్పగించారు. స్థలంతో పాటు కొ త్తగా మినార్లు సైతం తన సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అందు కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఉదారంగా ఇచ్చిన ఘనతను దక్కించుకున్నారు. రంజాన్ పండుగకు సన్నాహాలు ఈద్గాలో ప్రస్తుతం నూతనంగా మినార్లను నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రంజాన్ పండుగ సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేసి, పండుగను కొత్త స్థలంలో జరుపుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం కావలసిన సౌకర్యాలను, సహకారాన్ని కూడా నిజామాబాద్ ఎంపీ కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తలు అందిస్తున్నారు. వివాదాలు ఉండకూడదు. ముస్లింసోదరులు రంజాన్,బక్రీద్ పండుగల సమయంలో నమాజ్ చేసే ఈద్గా స్థలం వివాదం కాకూడదు. అందు కోసం నేను, నా వ్యాపార మిత్రులు సోహెల్‌లు కలసి వివాదానికి తెరదించాలని భావించాము. దీంతో కబ్జాకు గురైన ఈద్గా స్థలాన్ని కొనుగోలు చేసి ఈద్గా పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. దీంతో గత కొంత కాలంగా ఉన్న ఈద్గా స్థల వివాదం సమసిపోయింది. -ఇద్రిస్‌ఖాన్, వ్యాపారి -
మంథనిని జిల్లా చేయాలి
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మంథని : చరిత్రాత్మకంగా, భౌగోళికంగా అనువైన ప్రదేశంగా ఉన్న మంథనిని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఇటీవల మృతిచెందిన అర్చకుడు జగన్నాథచార్యులు కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు ముఖ్య ప్రాంతాలకు కూడలిగా ఉన్న మంథనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు అమోదయోగ్యంగా ఉంటుందన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిం దని, టీఆర్ఎస్ పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నారు. మంథనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుంటే కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శశిభూషన్‌కాచే, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీంఖాన్ ఎంపీటీసీ సభ్యులు లొడారి రాములు, కుంట శ్రీనివాస్, నాయకులు వొడ్నాల శ్రీనివాస్, సేమంతుల ఓదెలు, సింగారపు కిష్టయ్య, నూకల బానయ్య, పోలు శివ, అంబీరు బాపు తదితరులు ఉన్నారు.