మంథనిని జిల్లా చేయాలి
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
మంథని : చరిత్రాత్మకంగా, భౌగోళికంగా అనువైన ప్రదేశంగా ఉన్న మంథనిని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఇటీవల మృతిచెందిన అర్చకుడు జగన్నాథచార్యులు కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు ముఖ్య ప్రాంతాలకు కూడలిగా ఉన్న మంథనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు అమోదయోగ్యంగా ఉంటుందన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిం దని, టీఆర్‌ఎస్ పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నారు. మంథనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుంటే కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శశిభూషన్‌కాచే, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీంఖాన్ ఎంపీటీసీ సభ్యులు లొడారి రాములు, కుంట శ్రీనివాస్, నాయకులు వొడ్నాల శ్రీనివాస్, సేమంతుల ఓదెలు, సింగారపు కిష్టయ్య, నూకల బానయ్య, పోలు శివ, అంబీరు బాపు తదితరులు ఉన్నారు.