ఆకర్ష్
⇒ టీడీపీకి ఝలక్ ఇస్తున్న బీజేపీ
⇒ చాపకింద నీరులా పావులు కదుపుతున్న కాషాయనేతలు
⇒ రాజంపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యేపై గురి
⇒ ప్రొద్దుటూరు, మైదుకూరు సీనియర్ నేతలపైనా దృష్టి
⇒ తెలుగుతమ్ముళ్లలో మొదలైన బెంగ
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది చరిత్ర చెప్పే సత్యం. తెలుగుదేశంతో మితృత్వం కొనసాగిస్తునే సొంతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. చాపకింద నీరులా బీజేపీ సాగిస్తున్న ఎత్తుగడలతో అధికార తెలుగుదేశం పార్టీకి ఫీవర్ పట్టుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను చేర్చుకుని సత్తా చాటాలనే దృక్పధం బీజేపీ నేతల్లో అధికంగా ఉన్నట్లు కన్పిస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నా ఉపయోగం అన్నవారి పట్ల బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరస్పర రాజకీయ అవగాహన కుదుర్చుకుని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చారుు. భవిష్యత్ అలోచనలో భాగంగా ఉపయోగం అనుకున్న వారిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. కొందరు నేతల పట్ల టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా అవేవీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కమలాపురం నేత రాజోలి వీరారెడ్డి బీజేపీలో చేరిక అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యేలపై గురి...
పార్టీలో చేర్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అందులో భాగంగా రాజంపేటకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకుంటే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఆ సీటును టీడీపీ ఖాతా నుంచి సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అరుుతే ఇంకా చాలా సమయం ఉంది.. అవకాశం వచ్చినప్పుడు చూద్దాం.. అంతవరకూ వెయిట్ చేయండి అని ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో కొందరు నేతలు అన్నట్లు సమాచారం.
కాషాయనేతల ఎత్తుగడలు టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బీజేపీ నేతల చర్యలు పరిశీలిస్తే భవిష్యత్లో టీడీపీకి ఆపార్టీ దూరం అయ్యే సూచనలు క న్పిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడే చంద్రబాబును నమ్ముకునే కంటే సొంతంగా ఎదగడం అన్ని విధాలా మేలని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టీడీపీలోకి అనేకమంది నేతలు చేరిపోయూరు. ఇటువంటి వారిపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. దీంతో అధికార టీడీపీకి బీజేపీ ఫీవర్ పట్టుకుంటోందని పలువురు పేర్కొంటున్నారు.