లోయలో పడ్డ బస్సు: 50 మంది మృతి
పెరూ రాజధాని లిమా దక్షిణా భాగంలో గత రాత్రి బస్సు లోయలోపడిన ఘటనలో 50 మంది ప్రయాణీకులు మరణించారని ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. మృతుల్లో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. దాదాపు 650 అడుగులపై నుంచి బస్సు లోయలో పడటంతో మృతుల సంఖ్య పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పెరూలోని అండీస్ పర్వతపంక్తిపై ప్రయాణం అత్యధిక ములుపులు ఉంటాయని అలాగే చాలా అపాయకరమైన రహదారని తెలిపారు. ఆ ఘటనలో మరణించిన వారంతా పేద రైతులని పేర్కొన్నారు. ప్రమాద ఘటన స్థలంలో తమ సిబ్బంది సహాయ చర్యలను చేపట్టిందని, అయితే ఆ ప్రమాదంలో ప్రయాణీకులంతా మరణించారని అగ్నిమాపక దళ ఉన్నతాధికారి డేవిడ్ తబోడా తెలిపారు.