బొగత జలపాతం అభివృద్ధికి కృషి
రూ. 12 కోట్లతో పర్యాటకులకు సౌకర్యాలు
తెలంగాణ టూరిజం చైర్మన్ పేర్వారం రాములు
ఏటూరునాగారం : ఖమ్మం జిల్లా వాజేడులోని బొగత జలపాతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ డీజీపీ, తెలంగాణ టూరిజం చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. ఏకో టూరిజం ఆధ్వర్యంలో రూ. 12 కోట్లతో ఇక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. బొగత జలపాతాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్మించనున్న భవనాలు, హోటళ్లు, అతిథి నివాస గృహాలు, పర్యాటకుల కోసం ఏ ర్పాటు చేసే సౌకర్యాల మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం పేర్వారం రాములు మాట్లాడుతూ ప్రకృతితో పెనువేసుకున్న జలపాతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఈ శ్యామూ ల్ లక్కపల్లి, పర్యాటకశాఖ జిల్లా మేనేజర్ నాథన్ , యూనిట్ మేనేజర్లు సురేష్, శ్రీకాంత్, ఎస్ఈ గంగారెడ్డి, డీటీఓ శివాజీ, ఎస్సై వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. బొగత జలపాత