రేపటి నుంచి పీజీఈసెట్
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హైదరాబాద్: పీజీఈసెట్– 2017 (ఇంజనీరింగ్ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు) రేపటి (29వ తేదీ) నుంచి ప్రారంభంకానున్నట్లు పీజీఈసెట్ కన్వీనర్ డాక్టర్ రమేశ్‌బాబు తెలిపారు. ప్రవేశ పరీక్షల కోసం తొలిసారి ఆన్లైన్ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. జూన్ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు 1.30 నిమిషాల ముందు గానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్య ర్థులకు సూచించారు.
పరీక్ష రాసిన రోజు రాత్రి 8 గంటలకు జవాబు పత్రాన్ని డౌన్లోడ్ చేసు కోవచ్చ న్నారు. నిమిషం ఆలస్య మైనా పరీక్షకు అనుమ తించబోమన్నారు. ఫలితాలను జూన్ 12న విడుదల చేస్తామన్నారు.