pg student suicide
-
కరోనాతో ఉద్యోగం రాదని విద్యార్థి బలవన్మరణం
సాక్షి, చండూరు: కరోనా కాలంలో.. ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదని మనస్తాపానికి గురైన ఓ పీజీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాక రామచంద్రం, గంగమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పాక శ్రీకాంత్ (25) రెండేళ్ల క్రితమే బాటనీలో పీజీ పూర్తిచేశాడు. తండ్రి గతంలోనే అనారోగ్యంతో మృతిచెందగా, తల్లి మానసిక రోగి కావడంతో శ్రీకాంత్ స్వయంకృషితో చదువుకున్నాడు. ఉద్యోగవేటలో ఉండగా కరోనా విజృంభిస్తుండడంతో తనకిక ఉద్యోగం రాదని మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం సాయంత్రం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఇరుగుపొరుగు రైతులు గమనించి 108లో నల్లగొండ జనరల్ ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయాడు. -
ఈ పెళ్లి వద్దంటూ పీజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, భువనగిరి అర్బన్ : తనకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ యువతి మనస్తాపానికి గురై రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన భువనగిరి మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వేపోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన అరె యాదయ్య కుమార్తె రేవతి(22) నల్లగొండ ఎన్జీ కళాశాలలో పీజీ చదువుతోంది. రేవతికి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రేవతి గురువారం కళాశాలకు వెళ్తున్నానని బయటికి వెళ్లింది. అనంతరం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో రైల్వేపోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్ఐ అచ్యుతం తెలిపారు. -
'ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలి'
- జీజీహెచ్ లో డాక్టర్ల ధర్నా గుంటూరు మెడికల్: గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు జీజీహెచ్‌లో సూపరిండెంట్ చాంబర్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ప్రొఫెసర్ వేధింపుల వల్లే పీజీ సెకండియర్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జూనియర్ డాక్టర్లను సముదాయిస్తున్నారు. కాగా గైనకాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చదువుతున్న సంధ్యారాణి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది.