ఈ పెళ్లి వద్దంటూ పీజీ విద్యార్థి ఆత్మహత్య | PG Student Committed Suicide With Unwanted Marriage Proposal In Bhongir | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 8:06 AM | Last Updated on Sat, Apr 28 2018 8:07 AM

PG Student Committed Suicide With Unwanted Marriage Proposal In Bhongir - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భువనగిరి అర్బన్‌ : తనకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ యువతి మనస్తాపానికి గురై రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన భువనగిరి మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వేపోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన అరె యాదయ్య కుమార్తె రేవతి(22) నల్లగొండ ఎన్జీ కళాశాలలో పీజీ చదువుతోంది. రేవతికి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రేవతి గురువారం కళాశాలకు వెళ్తున్నానని బయటికి వెళ్లింది.

అనంతరం మండలంలోని  నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో రైల్వేపోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్‌ఐ అచ్యుతం తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement