పినాక–2 పరీక్ష విజయవంతం
బాలసోర్ (ఒడిశా): పినాక రాకెట్ మార్క్–2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి గురువారం దీనిని విజయవంతంగా పరీక్షించారు. పినాక మార్క్–1కు నేవిగేషన్, మార్గనిర్దేశనం, నియంత్రణ కిట్లను జతచేర్చి పినాక–2ను అభివృద్ధి చేశారు. అన్ని నిర్దేశిత ప్రమాణాలను పినాక–2 అందుకుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీనిని హైదరాబాద్లోని ఆర్సీఐ, డీఆర్డీఎల్, పుణెలోని ఏఆర్డీఈలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.