ఈ డ్రైఫ్రూట్‌తో నిద్రలేమికి చెక్!
నిద్రలేమి అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిని వేధిస్తున్నసాధారణ సమస్యగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..శారీర మానసిక ఆరోగ్యం కోసం నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. అయితే చాలామందికి సరైన నిద్ర లేకపోవడానికి ప్రధాన కారణాలు జీవనశైలి, ఆహార సమస్యలే అని చెబుతున్నారు నిపుణులు. ఈ నిద్ర సమస్య విటమిన్లు ఏ, సీ, డీ, ఈ, కే, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాల లోపం వల్లే వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ లోపాన్ని అధిగమించేందుకు పోషకాలతో నిండిన ఈ డ్రైఫ్రూట్ తీసుకోమని సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటా డ్రైఫ్రూట్? నిద్రలేమికి ఎలా సహాయపడుతుందంటే?నిద్రలేమికి పిస్తాపప్పు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇది నిద్రలేమి సమస్యకు సహజ సప్లిమెంట్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మెలటోనిన్ స్లీప్ హార్మోన్‌తో లోడ్ చేయడబడి ఉంటుంది. మంచి నిద్ర సహాయకారిగా పిస్తాపప్పులను పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చీకటికి ప్రతిస్పందనగా మెలటోనిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. పిస్తాపప్పులు తీసుకుంటే సహజంగానే ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందట.సుమారు 100 గ్రాముల షెల్డ్ పిస్తాలో 23 mg మెలటోనిన్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే.. నిద్రలేమి కోసం వాడే మెలటోనిన్ సప్లిమెంట్లలో కంటే ఎక్కువ. అంతేగాదు పిస్తాలో మెగ్నీషియం, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి మంచి ప్రశాంతమైన నిద్రను అందించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఎప్పుడు తింటే మంచిదంటే..మెగ్నీషియం, మెలటోనిన్ మాత్రలు వేసుకోవడం కంటే నిద్రవేళకు ఒక గంట ముందు కొన్ని పిస్తాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పచ్చిగా లేదా షెల్డ్గా తీసుకోవచ్చు లేదా మంచి రుచి కోసం కాల్చి తినవచ్చు. ఇక్కడ పరిమితికి మించి తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అదనపు కేలరీలను అందిస్తుంది. అందులోనూ రాత్రిపూట తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మంచి నిద్ర కోసం చేయాల్సినవి..ప్రతిరోజూ నిర్ణిత సమయానికే నిద్రపోవాలని చెబుతున్నారు నిపుణులు పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు స్క్రీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలి.ఎల్లప్పుడూ మీ పడకగదిలో ఉష్ణోగ్రతను 65–68°F మధ్య ఉంచండి.అలాగే నిశబ్దంగా ఉండేలా ఫ్యాన్, ఎయిర్ కండీషనర్‌ని చూసుకోండికెఫిన్ తాగవద్దు, ఎక్కువ భోజనం చేయవద్దు అలాగే నిద్రవేళల్లో ఆల్కహాల్ లేదా నికోటిన్‌ని ఉపయోగించవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండిపగటిపూట చురుకుగా ఉండేలా చూసుకుంటే బాగా నిద్రపోవచ్చు ఒత్తిడి, ఆందోళన, చింతించడం లాంటివి దూరం చేసుకోండి. (చదవండి: నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?)