కోదండరామ్ మంతనాల మర్మమేమిటో?
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై విమర్శల పరంపర కొనసాగుతోంది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్ మరోసారి కోదండరామ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీ.జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, కోదండరామ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. ఓ సామాజిక వర్గ నేతలతో కోదండరామ్ మంతనాలు జరిపారో లేదో చెప్పాలని పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధాలు వద్దన్న ఆయనే మళ్లీ వాళ్లనే కలిశారని అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కోదండరామ్ మంటగలుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.