‘‘సాహో’ టీం ఆమె వర్క్‌ను కాపీ చేసింది’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సాహో చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన సాహో అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే కొంత డివైడ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికి వసూళ్లపరంగా ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సాహో చిత్రంపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ నటి లిసా రే సాహో చిత్ర యూనిట్‌పై కాపీ ఆరోపణలు చేస్తున్నారు. సాహో యూనిట్, షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్‌ను కాపీ కొట్టారని లిసా ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రభాస్, శ్రద్ధా కలిసి ఉన్న ‘బేబీ వోన్ట్ యూ టెల్ మీ’ అనే పోస్టర్‌ను, దాంతో పాటు ఒరిజినల్ పోస్టర్‌కు సంబంధించిన చిత్రాలను లిసా రే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ రెండు ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ వర్క్ ఒకేలా ఉంది.
ఈ సందర్భంగా లిసా రే మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర యూనిట్ చేసిన తప్పును ఎత్తి చూపడమే కాక బాధితుల పక్షాన నిలబడి, వారికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓ భారీ బడ్జెట్ చిత్రంలో షిలో ఆర్ట్‌వర్క్‌ను ఒక దాన్ని కాపీ చేశారు. దీన్ని ప్రేరణ అనలేం.. ఇది ఖచ్చితంగా దొంగతనమే. ఇలాంటి పనులను ప్రపంచంలో ఎవరూ ఆమోదించరు. ఈ ఆర్ట్‌వర్క్‌ను వినియోగించుకునే ముందు సాహో యూనిట్ దాని సంబంధిత యజమానిని సంప్రదించలేదు.. ఆమె అనుమతి కూడా తీసుకోలేదు. కనీసం ఆమె పనికి తగిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఇది సరైన పద్దతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు వ్యక్తికి ఎలా ఉంటుందంటే.. ఎవరో దొంగ మీ ఇంట్లో చొరబడి మీ జీవితానికి, మీ జీవనోపాధికి, ఆత్మకు సంబంధించి అతి ముఖ్యమైన వస్తువును దొంగిలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు షిలో పరిస్థితి కూడా అలానే ఉంది’ అని తెలిపారు లిసా రే.
(చదవండి: జీవితం భలే మారిపోయింది)
View this post on Instagram
What is creativity? What is art? Where does it come from? We know what it is not. It’s not your social status. It’s not your job title. It’s not your appearance. It’s not even the image you see in the mirror. Creativity and its sister Art reach us from the sweet spot of the universe- the soul you might say- through mystery. But I do know that the creator- artist is the channel for it. Let me tell you how hard it is to create- anything- original or authentic. I personally labored for years over my book, quelled the doubts and noise from others and didn’t emerge until I had almost undone myself. Because it’s a calling. And when I was moving through dark moment of self-doubt or creative blocks, I would turn to the work that @shiloshivsuleman puts out into the world and shares on her Instagram handle. She may not even know this, but I can recognize when a creator works honourably and deeply, bleeding, sacrificing, unsleeping, stretching herself in the direction of emotional bravery to produce work that births those feelings we all look for in day to day life. To feel inspired. To feel alive. That’s why when something dishonorable happens, we need to stand up and speak up. To hold up a mirror to these makers to make them understand THIS IS NOT RIGHT. It’s come to light that a big budget film production has ripped off one of Shilo’s original creations. This is NOT inspiration but blatant theft. In no world, is this acceptable. The production did not contact the creator, ask her permission nor offer to collaborate or offer a credit. Nothing. This is not right. I believed the Hindi film industry was evolving necessarily past stealing storylines and rampant plagiarism but the producers of Shahoo have obviously not gotten the memo when it comes to art. Here’s the thing- Creators are worthy of worship. What they produce are more lasting and precious so than all the other ‘things’ we accumulate that can be taken away. Let’s hold these producers accountable for their infuriating, dishonourable action. How would you feel if a thief slid into your home and took away your most prized possessions? Your heart. Your soul. And your livelihood. Image @dietsabya
A post shared by lisaraniray (@lisaraniray) on Aug 30, 2019 at 5:05am PDT