స్లిమ్‌గా తయారు కావాలంటే..?
న్యూయార్క్: మీరు స్లిమ్‌గా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ప్రతి రోజు మంచి నీళ్లను కాస్త ఎక్కువగా తాగండి. దీనివల్ల శరీరంలో చక్కటి మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సుగర్, ఉప్పు, కొవ్వు పదార్థాలను తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
పరిశోధకుల బృందం అమెరికాలో 18,300 మందిని పరీక్షించింది. వీరు ప్రతి రోజు ఒక శాతం అదనంగా మంచి నీళ్లు తీసుకోవడం మంచి ప్రభావం కనిపించింది. ప్రతి రోజు ఒకటి, రెండు లేదా మూడు కప్పుల నీళ్లు అదనంగా తీసుకోవడం వల్ల 68 నుంచి 205 కేలరీల భోజనం, 78 నుంచి 235 గ్రాముల ఉప్పు తీసుకోవాల్సిన అవసరం లేకపోయిందని గుర్తించారు. మునుపటితో పోలిస్తే స్లిమ్ గా మారారు. అంతేగాక, చదువు, శరీర బరువుపైనా ప్రభావం చూపినట్టు వెల్లడించారు.