play cricket
-
Father's Day 2024: స్టార్ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)
-
కరుణ బౌలింగ్.. మునిమనవడి బ్యాటింగ్!
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన డీఎంకే అధినేత కరుణానిధి కోలుకుంటున్నారు. మునిమనవడితో క్రికెట్ ఆడుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇందులో కరుణానిధి బౌలర్ అవతారం ఎత్తారు. రెండు రోజుల క్రితం కరుణానిధి కొడుకులో ఒకరైన ముక్కా తమిళరసు తన మనవడు ముగిలన్(2)తో గోపాలపురం వచ్చారు. దీంతో కుటుంబసభ్యులంతా కలసి కరుణానిధితో ఆనందాన్ని పంచుకుంటూ క్రికెట్ ఆడారు. -
విద్యార్థులు పట్టుదలతో క్రికెట్ ఆడాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పట్టుదలతో క్రికెట్ ఆడాలని వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ అన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్కూల్ లెవల్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఆదివారం స్కూల్ స్థాయి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల క్రికెట్లో రాణించడానికి దోహదపడతాయన్నారు. క్రీడాకారులు క్రికెట్లో మెలకువలు నేర్చుకుంటే క్రీడా పోటీల్లో విజయం సులువవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, టోర్నమెంట్ కన్వీనర్ ఎస్డీ. అమీనోద్దీన్, ప్రసన్న, ఎండీ.అలీ తదితరులు పాల్గొన్నారు.