ఆధ్యాత్మికం... వైజ్ఞానికం... శ్రీచక్రం
సత్ గ్రంథం
శ్రీ చక్రమనేది కేవలం అమ్మవారిని ఆరాధించేందుకు తోడ్పడేది మాత్రమే అనుకుంటాం. అయితే శ్రీ చక్రం అనేది ఎక్కడో లేదు... మన శరీరంలోనే కొలువై ఉంటుందని, సాధన చేస్తే మానవ శరీరాన్నే శ్రీ చక్ర స్వరూపంగా మలచుకోవచ్చునని డాక్టర్ గుడిపాటి వెంకట రంగా రాజేంద్ర ప్రసాద్ తన ‘శ్రీ చక్రము- మానవ శరీరము’ గ్రంథం ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలో వివిధ హోదాలలో పని చేసి, ఉద్యోగ విరమణ చేసిన గుడిపాటి వారు ఈ గ్రంథం ద్వారా మహర్షుల జ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని సమన్వయం చేస్తూ అమూల్యమైన ఆధ్యాత్మిక రహస్యాలను, సాధనాపద్ధతులను సామాన్యులకు కూడా అర్థమయ్యేట్లు చెప్పేందుకు ప్రయత్నించారు.
మానవ శరీరంలో గల మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాల గురించి వివరిస్తూనే, ఆయా చక్రాలకు, భగవత్తత్వానికి గల అన్వయాన్ని, కూడా విశదీకరించారు. వీటితోబాటు కుండలినీ శక్తి అంటే ఏమిటి? దానిని ఎలా జాగృతం చేయాలి, మంత్రోపాసన ఎలా చేయాలి? శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం, శ్రీ లలితా మూలమంత్ర కవచాలను అనుబంధంగా అందించడం పుస్తక పఠనీయతను పెంచిందని చెప్పాలి.
శ్రీ చక్రము- మానవ శరీరము ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథం
పుటలు: 168; వెల రూ. 200; ప్రతులకు: గుడిపాటి వి.ఆర్.ఆర్. ప్రసాద్, ప్లాట్ నం. 18, 7-8-51, హస్తినాపురం సెంట్రల్ కాలనీ, ఫేజ్ 2, నాగార్జున సాగర్ రోడ్, హైదరాబాద్-79; ఫోన్: 040 24093514
- డి.వి.ఆర్.