plotters
-
సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వస్తున్నకీలక విషయాలు
న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...పంజాబ్ సింగర్ సిద్ధూని హత్యకు సంబంధించిన కుట్రదారుల్లో ఒక వ్యక్తి హత్యకు నెలరోజుల మందుగానే నకిలీ పాస్పోర్టుతో భారత్ వదిలి పారిపోయాడని చెప్పారు. ఆ వ్యక్తి సచిన్ బిష్ణోయ్ అని, అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహిత సహచరుడని పేర్కొన్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసి తర్వాతే నకీలీ పాస్‌పోర్ట్ సహాయంతో ఇండియా వదిలి పారిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందుగానే గుర్తించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21 వరకు భారత్‌లోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడు కెనడాకు చెందిన గోల్డీ బ్రార్‌తో పాటు రాపర్‌ని హత్య చేసిన ఇద్దరు ప్రధాన కుట్రదారులలో ఒకరుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ చిరునామాతో తిలక్ రాజ్ తోటేజా పేరుతో సచిన్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌ను పొందినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసే వాలేని హత్య చేసింది మే 29న అయితే సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21నే భారత్‌ని వదలి దూబాయ్ పారిపోయాడని అక్కడి నుంచి అజర్బైజాన్ వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సచిన్ బిష్ణోయ్ ఢిల్లీలో ఉన్నప్పుడే మూస్ వాలా హత్యకు సంబంధించిన మొత్తం ప్లాన్‌ని సిద్ధం చేసి, షూటర్లకు షెల్టర్లు, డబ్బు, వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదీగాక సిద్ధూ మూసే వాలేకి ఉన్న 424 భద్రతా సిబ్బంది తొలగించిన తర్వాత ఈ హత్య జరగడం గమనార్హం. (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
38 వేల మంది ఖైదీల విడుదలకు ఆదేశం
అంకారా: తిరుగుబాటు కుట్రదారుల కోసం జైళ్లు ఖాళీ చేయించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 38 వేల మంది ఖైదీలను షరతులపై విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం డిక్రీ జారీ చేసింది. రెండేళ్లు అంతకన్న తక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలని ఆదేశించింది. హత్య, గృహహింస, లైంగిక వేధింపులు, తీవ్రవాదం, దేశానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా వ్యవహరించిన కేసులో శిక్షలు పడినవారిని విడుదల చేయరాదని స్పష్టం చేసింది. జూలై 1 తర్వాత నేరం చేసి జైలుకు వచ్చిన వారిని కూడా విడుదల చేయరాదని నిర్ణయించింది. 38 వేల మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ బొజడాగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జూలై 15న సైన్యంలోని ఒక వర్గం తిరుగుబాటు చేసింది. ప్రజల సహకారంతో తిరుగుబాటును ప్రభుత్వం తిప్పికొట్టింది. తిరుగుబాటుకు కారణమయ్యారనే ఆరోపణలతో 35 వేల మంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. 17 వేల మందిపైగా అరెస్ట్ చేసినట్టు టర్కీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో సైనికులు, పోలీసులు, జడ్జిలు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. -
'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'
లండన్: ప్రభుత్వంపై తిరుగుబాటుకు విఫలయత్నం చేసిన వారిని టర్కీ ప్రభుత్వం క్రూరంగా హింసిస్తోందా.. అవుననే అంటోంది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సైనిక తిరుగుబాటులో సహకరించిన 13,165 మందిని ఇప్పటివరకు టర్కీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వీరిలో సైనిక అధికారులు, లాయర్లు, జడ్జీలు, పోలీసు అధికారులు, పౌరులు ఉన్నారు. అయితే.. వీరందరిపట్ల టర్కీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని ఆమ్నెస్టీ వెల్లడించింది. అదుపులోకి తీసుకున్న వారికి అహారం అందించకుండా, తీవ్రంగా కొడుతూ.. కొందరిపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆమ్నెస్టీ సంస్థ సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, మానవహక్కులను కాలరాయొద్దని ఆ సంస్థ టర్కీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఇవాళ ప్రభుత్వ మద్దతుదారులు రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బంధీలను తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన విషయాలను టర్కీ ప్రభుత్వం తోసిపుచ్చింది. మానవహక్కులను కాలరాసే పనులను తమ ప్రభుత్వం చేయడంలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం చూస్తున్న తమ దేశం అనుచిత చర్యలకు పాల్పడదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.