PNB Q1
-
భారీ స్కాం : 10 మంది బ్యాంకు ఉద్యోగులు సస్పెండ్
దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ముంబై బ్రాంచులో దాదాపు రూ.11,359 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు తేల్చింది. డైమండ్ మెర్చంట్ నిరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, బిజినెస్ పార్టనర్ మెహల్ చోక్సి ఈ స్కాంకు పాల్పడినట్టు బ్యాంకు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో భాగంగా 10 మంది ఉద్యోగులను పీఎన్బీ సస్పెండ్ చేసినట్టు బ్యాంకింగ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. దీనిపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సీబీఐ విచారణ చేపట్టింది. మొండి బకాయిలను గుర్తించడానికి ఈ విచారణ సహకరిస్తుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం ముంబైలోని ఓ బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును విదేశీ అకౌంట్లకు తరలించినట్టు కూడా ధృవీకరించింది. ఈ కుంభకోణం వల్ల బ్యాంకుకు ఏ మేర నష్టం వాటిల్లుతుందో పీఎన్బీ వెల్లడించలేదు. కాగ, ఇదే బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జువెల్లరీ నిరవ్ మోదీని గతవారమే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ నష్టాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు ఈ వార్తల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు బుధవారం మధ్యాహ్నం అమాంతం పడిపోయాయి. పీఎన్బీ ముంబయి బ్రాంచ్‌లో దాదాపు రూ.11,359 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రూ.160 షేరు విలువతో బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభించిన పీఎన్బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేల కోట్ల సంపదను కోల్పోయారు. -
పీఎన్బీ లాభాలకు బకాయిల దెబ్బ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకూ మొండిబకాయిల దెబ్బ తగిలింది. గురువారం వెల్లడించిన ప్రస్తుతం ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికరలాభాలు 57.49 శాతం పతనమై, రూ.30.6.36 కోట్లగా నమోదయ్యాయి.గతేడాది ఇదేక్వార్టర్లో రూ.720.71 కోట్లగా ఉన్న ఈ లాభాలు సగానికి పైగా పడిపోయాయి. అయితే బ్యాంకు ఆర్జించిన మొత్తం ఆదాయాలు కొంత మెరుగ్గా రూ.3.70 శాతం ఎగిసి, రూ.13,930 కోట్లగా ఉన్నట్టు పీఎన్బీ పేర్కొంది. అంతకముందు క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.13,432.05 కోట్లగా ఉన్నాయి. రూ.12,034.69 కోట్లగా ఉన్న వడ్డీ ఆదాయాలు బ్యాంకుకు రూ.3.8 శాతం తగ్గి, రూ.11,574.94 కోట్లగా రికార్డు అయినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫలితాల్లో వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు 13.75 శాతం ఎగిశాయి. నికర ఎన్పీఏలు కూడా 4.05 శాతం నుంచి 9.16 శాతానికి పెరిగాయి. బ్యాడ్ లోన్స్ సైతం ఒక్కసారిగా 51.17 శాతానికి జంప్ అయి, రూ.2,738.38 కోట్లగా నమోదయ్యాయి. ఫలితాల్లో పీఎన్బీ నిరాశపర్చడంతో నేటి నిఫ్టీ ట్రేడింగ్ లో ఆ బ్యాంకు షేర్లు 2.9శాతం డౌన్ అయి, రూ.128.95గా ముగిశాయి.