పీఎన్బీ లాభాలకు బకాయిల దెబ్బ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకూ మొండిబకాయిల దెబ్బ తగిలింది. గురువారం వెల్లడించిన ప్రస్తుతం ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికరలాభాలు 57.49 శాతం పతనమై, రూ.30.6.36 కోట్లగా నమోదయ్యాయి.గతేడాది ఇదేక్వార్టర్లో రూ.720.71 కోట్లగా ఉన్న ఈ లాభాలు సగానికి పైగా పడిపోయాయి. అయితే బ్యాంకు ఆర్జించిన మొత్తం ఆదాయాలు కొంత మెరుగ్గా రూ.3.70 శాతం ఎగిసి, రూ.13,930 కోట్లగా ఉన్నట్టు పీఎన్బీ పేర్కొంది. అంతకముందు క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.13,432.05 కోట్లగా ఉన్నాయి.
రూ.12,034.69 కోట్లగా ఉన్న వడ్డీ ఆదాయాలు బ్యాంకుకు రూ.3.8 శాతం తగ్గి, రూ.11,574.94 కోట్లగా రికార్డు అయినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫలితాల్లో వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు 13.75 శాతం ఎగిశాయి. నికర ఎన్పీఏలు కూడా 4.05 శాతం నుంచి 9.16 శాతానికి పెరిగాయి. బ్యాడ్ లోన్స్ సైతం ఒక్కసారిగా 51.17 శాతానికి జంప్ అయి, రూ.2,738.38 కోట్లగా నమోదయ్యాయి. ఫలితాల్లో పీఎన్బీ నిరాశపర్చడంతో నేటి నిఫ్టీ ట్రేడింగ్ లో ఆ బ్యాంకు షేర్లు 2.9శాతం డౌన్ అయి, రూ.128.95గా ముగిశాయి.