నేడు పాలీసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ృ2017 పరీక్ష ఫలితాలను 6వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని రూసా సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల 22న నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాలను www.sakshi.com, www. sakshieducation.com, https://polycetts. nic.in, www.dtets.cgg.gov.in, www.sbtet. telangana.gov.in, softnet.telangana.gov.in వెబ్ సైట్లలో పొందవచ్చు. కాగా, గతేడాది నిర్వహించిన ఎంసెట్, ఐసెట్, పాలీసెట్‌లో ఏ ర్యాంకు వారికి ఏ కాలేజీలో సీటొచ్చిందనే వివరాలతో కూడిన సీడీని శనివారం కడియం శ్రీహరి విడుదల చేస్తారు. ఈ నెల చివరలో ప్రారంభం కానున్న ఆయా ప్రవేశాలలో విద్యార్థులకు ఉపయోగపడేలా సాంకేతిక శాఖ ఈ సీడీని రూపొందించింది.