సదా వ్యక్తిగత కార్యదర్శిగా పొన్నురాజ్
శివమొగ్గ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి వి. పొన్నురాజ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. పొన్నురాజ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే తాను వెళ్లనున్నట్లు చెప్పారు. కాగా, శివమొగ్గ కలెక్టర్గా పొన్నురాజ్ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందారు.