Poor child
-
‘చిన్నారులను ఆదుకుంటాం’
గొటివాడ(జలుమూరు): ‘చిన్ని బతుకులు అంతులేని కష్టాలు’ అన్న శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు దాతలు స్పందిస్తున్నారు. తల్లితండ్రీ లేక చిన్నారులు అవస్థలు పడుతున్న తీరు చూసి చలించిపోతున్నారు. సారవకోట మండలం బుడితికి చెందిన కర్మేయిలు ప్రార్థన మందిరం ప్రతినిధులు, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్(ఐసీడబ్లూ్యఏ) మేనేజర్ నాగేశ్వరరావులు గురువారం గొటివాడ వచ్చి నీలిమ, అప్పలనాయుడు, వెన్నెలను చూశారు. చిన్నారులను తమ సంస్థ ద్వారా డిగ్రీ వరకు ఉచితంగా చదివిస్తామని, వారి పోషణ బాధ్యత అంతా చూసుకుంటామని తెలిపారు. జువైనల్ చైర్మన్ ఆదేశాల ప్రకారం చట్టబద్ధంగా వీరి బాధ్యతలను తాము తీసుకుంటామని చెప్పారు. దీనిపై స్థానికులతో చర్చించారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనం చదివిన తర్వాత చల్లవానిపేట అరుణోదయ విద్యాసంస్థల అధినేత కె.అప్పలనాయుడుతో పాటు చాలామంది దాతలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని రెయ్యిమ్మ అనే మహిళ వారికి తెలిపారు. ఈ నెల 21న చల్లవానిపేట అరుణోదయ పాఠశాలలో సమావేశం నిర్వహించి అందులో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్ణయం ప్రకటిస్తామని స్థానికులు తెలిపారు. అలాగే మండల జన్మభూమి కమిటీ సభ్యులు బగ్గు గోవిందరావు, జలుమూరు సర్పంచ్ ప్రతినిధి కోన దామోదరావు, శ్రీముఖలింగం సర్పంచ్ ప్రతినిధి తర్ర బలరాం తోపాటు పలువురు స్పందించారు. వీరితోపాటు డాక్టర్ వినోద్, వార్డిన్ శ్రీనివాసరావు, ఐజెక్ పాఠశాల హెచ్ఎం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పేద పిల్లల ఆకలి తీరేదెలా?
మార్కాపురం, న్యూస్‌లైన్: సమైక్య నిరసనల దెబ్బకు అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 21 ప్రాజెక్టుల పరిధిలో సుమారు 4,500 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖ సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఈ నెల కేంద్రాలకు బియ్యం సరఫరా జరగడం దుర్లభంగా మారింది. మార్కాపురం రూరల్, యర్రగొండపాలెం, బేస్తవారిపేట, కనిగిరి ప్రాజెక్టుల్లో ఇందిరమ్మ అమృతహస్తం పథకం కింద కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మిగిలిన 17 ప్రాజెక్టుల్లో మధ్యాహ్న భోజన పథకం కింద బాలింత, గర్భిణులకు నెలకు 3 కిలోల బియ్యం, అర్ధకిలో కందిపప్పు, 500 గ్రాముల నూనె అందిస్తున్నారు. అయితే మొత్తం 21 ప్రాజెక్టుల పరిధిలో 30వేల మంది 3 నుంచి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి 75 గ్రాముల బియ్యం, 10 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల ఆయిల్‌ను కేటాయించారు. ఆకు కూర పప్పు, సాంబారు, కిచిడి, గుడ్లు, తదితర పదార్థాలు మెనూలో చేర్చారు. కానీ సమైక్యాంధ్ర సమ్మెకు ఖజానా సిబ్బంది కూడా మద్దతిస్తుండడంతో బిల్లులు చేతికిరాక అంగన్వాడీ కార్యకర్తలు సతమతమవుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా అధికమవడంతో పిల్లలకు భోజనం అందించడం తలకు మించిన భారంగా మారింది.