posterrelease
-
గాఢమైన ప్రేమకథ
శివ కందుకూరి హీరోగా నటించిన తాజా ఇంటెన్స్ లవ్ స్టోరీ (గాఢమైన ప్రేమకథ) ‘మను చరిత్ర’. ఇందులో మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను జూన్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ విజయ ఫిల్మ్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ‘‘వరంగల్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. ఇందులో ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్‌ను శివ చేశారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్. -
వర్మా వర్మా వర్మా.. ఓ రాంగ్ గోపాల్ వర్మ
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కమెడియన్ ‘షకలక’ శంకర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా పోస్టర్‌ను మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘మహిళల పట్ల చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టల్ని ఎండగడుతూ ప్రభు రూపొందించిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయిన నేను ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం నేను రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ..’ అనే పాటను త్వరలో విడుదల చేస్తాం’ అని ప్రభు తెలిపారు. (రాంగ్ గోపాల్ వర్మ) -
ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలి
మద్దిలపాలెం: ఆంధ్రప్రదేశ్ ఆటోడ్రై వర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐటీయూసీ) అనుబంధం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న బంద్‌ను విజయవంతం చేయాలని నగర గౌరవ అధ్యక్షులు జి.వామనమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కృష్ణా కళాశాల సమీపంలోని ఫెడరేషన్ కార్యాలయం వద్ద బంద్ గోడపత్రిను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర ప్రధాన కార్యదర్శి లంకా గోవింద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రులను మోసం చేసే విధంగా రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదనడం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ఈ మేరకు నగరంలో అఖిల పక్ష పార్టీలు నిర్వహిస్తున్న బంద్‌కు మద్దతుగా ఆటో కార్మికులంతా కలిసి రావాలని కోరారు.