ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలి | auto bandh poster release | Sakshi
Sakshi News home page

ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలి

Published Mon, Aug 1 2016 5:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలి

ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలి

మద్దిలపాలెం: ఆంధ్రప్రదేశ్‌ ఆటోడ్రై వర్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఏఐటీయూసీ) అనుబంధం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న బంద్‌ను విజయవంతం చేయాలని నగర గౌరవ అధ్యక్షులు జి.వామనమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కృష్ణా కళాశాల సమీపంలోని ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద బంద్‌ గోడపత్రిను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర ప్రధాన కార్యదర్శి లంకా గోవింద్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన చట్టంలో పొందుపరచిన  అంశాలను అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రులను మోసం చేసే విధంగా రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని పునర్‌విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదనడం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ఈ మేరకు నగరంలో అఖిల పక్ష పార్టీలు నిర్వహిస్తున్న బంద్‌కు మద్దతుగా ఆటో కార్మికులంతా కలిసి రావాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement