postings in AP
-
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, ట్రైనీలకు పోస్టింగ్స్
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. సివిల్ సప్లయిస్ డైరెక్టర్‌గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా మల్లారపు నవీన్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా సి. విష్ణు చరణ్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా నిధిమీనా, ఏపీసీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీఅయ్యారు. మరోవైపు.. 2020 బ్యాచ్ ట్రైనింగ్ ఐఏఎస్‌లకు కూడా ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. దీంతో, తెనాలి సబ్ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ, రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం బన్సల్, నరసాపురం సబ్ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజ, టెక్కలి సబ్ కలెక్టర్‌గా రవికుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్‌గా నూరుల్ కుమిర్, ఆదోని సబ్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్‌గా అధితిసింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా కార్తీక్, గూడూరు సబ్ కలెక్టర్‌గా శోభిక, కందుకూరు సబ్ కలెక్టర్‌గా మాధవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఆంధ్రా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వొద్దు
- సీఎస్‌ను కోరిన తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడి స్థానికత కలిగిన అధికారులను కమల్‌నాథన్ కమిటీ తెలంగాణకు కేటాయిస్తోందని, ఇది సరికాదని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం పేర్కొంది. తెలంగాణ స్థానికులు కాని రాష్ట్ర స్థాయి అధికారులకు రాష్ట్రంలో పోస్టింగ్‌లు ఇవ్వొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు శశికిరణాచారి, రఘు, ప్రసాద్, అరవింద్‌రెడ్డి, అలోక్‌కుమార్, వేణు, మాధవరెడ్డి సోమవారం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల విభజనలో స్థానికతను బట్టి ఏరాష్ట్ర అధికారులను ఆ రాష్ట్రానికే కేటాయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఖాళీలు లేకపోయినా స్థానికత ప్రకారమే కేటాయింపులు జరగాలని, ఆప్షన్లకు ప్రాధాన్యం ఇవ్వొద్దని విన్నవించారు.