- సీఎస్‌ను కోరిన తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడి స్థానికత కలిగిన అధికారులను కమల్‌నాథన్ కమిటీ తెలంగాణకు కేటాయిస్తోందని, ఇది సరికాదని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం పేర్కొంది. తెలంగాణ స్థానికులు కాని రాష్ట్ర స్థాయి అధికారులకు రాష్ట్రంలో పోస్టింగ్‌లు ఇవ్వొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు శశికిరణాచారి, రఘు, ప్రసాద్, అరవింద్‌రెడ్డి, అలోక్‌కుమార్, వేణు, మాధవరెడ్డి సోమవారం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల విభజనలో స్థానికతను బట్టి ఏరాష్ట్ర అధికారులను ఆ రాష్ట్రానికే కేటాయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఖాళీలు లేకపోయినా స్థానికత ప్రకారమే కేటాయింపులు జరగాలని, ఆప్షన్లకు ప్రాధాన్యం ఇవ్వొద్దని విన్నవించారు.
ఆంధ్రా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వొద్దు
Published Tue, May 5 2015 5:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement