సీఎస్‌కు తెలంగాణ గ్రూప్-1 అధికారుల వినతి
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో పనిచేస్తున్న తెలంగాణ అధికారులను అక్కడి నుంచి బదిలీ చేయాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరగౌడ్ నేతృత్వంలో గోపీనాథ్‌రెడ్డి, అంజన్‌రావు, ప్రేమ్‌కుమార్, నాగరాజు, యాదగిరితో కూడిన ప్రతినిధిబృందం మంగళవారం సీఎస్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది.
సీమాంధ్రలో సమ్మె విరమించే వరకు తాత్కాలికంగా అక్కడినుంచి తెలంగాణ అధికారులను ఓడీ మీద శాఖాధిపతుల కార్యాలయాల్లో నియమించాలని ఈ బృందం విన్నవించింది. ఒకవేళ బదిలీ సాధ్యం కానిపక్షంలో వారికి తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ‘‘ఎవరైనా బదిలీ కావాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే బదిలీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్లకు కూడా సానుకూలంగా స్పందిం చారు’’ అని చంద్రశేఖరగౌడ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
సీమాంధ్రలోని తెలంగాణ అధికారుల్ని బదిలీ చేయాలి
Published Wed, Oct 9 2013 12:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement