praivate institutes
-
'ప్రైవేటు విద్యాసంస్థల తీరు సరికాదు'
హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో తీసుకెళ్తానని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసుల తనిఖీలు నిలిపేయాలని వారు డిమాండ్ చేస్తున్నందున ఈ విషయాన్ని సీఎంకు తెలియజేస్తానని చెప్పారు. తనిఖీలు ఆపకుంటే విద్యాసంస్థలు మూసేస్తామన్నారని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో పరీక్ష కేంద్రాలకు అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగేలా సంస్థలను మూసేయడం సరికాదని అన్నారు. ఈ నెల 21న పాలిసెట్, 24న కానిస్టేబుల్ పరీక్షలు ఉన్నాయని వాటిని విద్యాసంస్థలు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. -
'పోలీసుల వేధింపులు సరికావు'
హైదరాబాద్: పీసీసీ కార్యవర్గ కూర్పు బాధ్యత హైకమాండ్‌దేనని టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు బాగా లేదని వచ్చిన వార్తలపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసుల వేధింపులు సరికావని ఉత్తమ్ అన్నారు. స్కాలర్ షిఫ్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ లకు సంబంధించిన రూ.3,600 కోట్లు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఈ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో, పీజీ స్టాఫ్‌ను భర్తీ చేయడం లేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.