హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో తీసుకెళ్తానని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసుల తనిఖీలు నిలిపేయాలని వారు డిమాండ్ చేస్తున్నందున ఈ విషయాన్ని సీఎంకు తెలియజేస్తానని చెప్పారు.
తనిఖీలు ఆపకుంటే విద్యాసంస్థలు మూసేస్తామన్నారని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో పరీక్ష కేంద్రాలకు అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగేలా సంస్థలను మూసేయడం సరికాదని అన్నారు. ఈ నెల 21న పాలిసెట్, 24న కానిస్టేబుల్ పరీక్షలు ఉన్నాయని వాటిని విద్యాసంస్థలు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.
'ప్రైవేటు విద్యాసంస్థల తీరు సరికాదు'
Published Mon, Apr 18 2016 7:01 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement