డీజీపీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
ఒంగోలు క్రైం: రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ఉదయం 9.15 గంటలకు గుడ్లూరు మండలం చేవూరులోని రామదూత ఆశ్రమంలోని హెలిపాడ్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రామాయపట్నం చేరుకుంటారు. అక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలిస్తారు. సిబ్బందితో మాట్లాడతారు. అక్కడ నుంచి చేవూరు ఆశ్రమంలోని హెలిపాyŠ కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో 10.30కు బయలుదేరి 10.35 గంటలకు ఒంగోలుకు చేరుకుంటారు. ఒంగోలు నుంచి రోడ్డు మార్గం ద్వారా కొత్తపట్నం 11.15కు చేరుకుంటారు. అక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. తీరాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 11.40కు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు.