prakasam zp chairman
-
ఈ నెల18 నుంచి ఒంగోలులో నాటకోత్సవాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో జనవరి18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్మన్, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడించారు. గురువారం ఒంగోలులో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావుతో కలసి హరిబాబు విలేకరులతో మాట్లాడారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బాలోత్సవం పేరుతో బాలల నాటికలు ప్రదర్శించనున్నట్లు ఈదర హరిబాబు వివరించారు. ఈ కార్యక్రమాలు స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతాయని ఆయన తెలిపారు. -
ఒంగోలు జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో మరో పీటముడి
ఒంగోలు: జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో ఉత్కంఠ వీడిందన్న ఆనందం తీరకముందే మరో పీటముడి పడింది. తాజాగా సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు మరోమారు అధికారులను చిక్కుల్లోకి నెట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై ఈదర హరిబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో మొత్తం 56 జెడ్పీటీసీ స్థానాలుండగా వాటిలో 31 స్థానాలను వైఎస్సార్సీపీ, 25 స్థానాలను టీడీపీ దక్కించుకున్నాయి. టీడీపీకి మెజార్టీ లేకపోయినప్పటికీ అధికారబలంతో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ముగ్గురు సభ్యులను మభ్య పెట్టి అటువైపు తిప్పుకోవడంతో జెడ్పీ పీఠం కైవసంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విప్ ధిక్కరించారంటూ టీడీపీ ఫిర్యాదు.. తాము జారీచేసిన విప్ పత్రం అందుకొని కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా ఉపాధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా వైస్ చైర్మన్ బరిలో నిలిచిన నూకసాని బాలాజీకి ఓటు వేశారని, అతనిని జెడ్పీటీసీ అభ్యర్థిగా అనర్హుడిగా ప్రకటించాలంటూ టీడీపీ తరుపున విప్ అధికారం పొందిన నరసింహం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం, దానిపై ఈదర అభ్యర్థిత్వం చెల్లదంటూ ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జెడ్పీటీసీకి అనర్హుడిగా ఈదర హరిబాబును ప్రకటించడంతో జెడ్పీ చైర్మన్ పదవిని కూడా ఆయన కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ఈదర హరిబాబు తొలుత హైకోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టులో కేసు దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా కోర్టులో కేసు దాఖలు చేయగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను సమర్థిస్తూ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈదర హరిబాబు హైకోర్టు సింగిల్ జడ్జిని ఆశ్రయించారు. తనకు విప్ జారీచేయడమే సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. చివరకు అధికారులు జెడ్పీ కార్యాలయానికి రాకుండానే జెడ్పీ చైర్మన్ ఛాంబర్‌కు తాళాలు వేశారు. తనను అధికారులు అవమానించారంటూ కొన్ని రోజులపాటు ఈదర జెడ్పీ మెట్లపైనే కూర్చొని నిరసన కూడా వ్యక్తం చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా వైస్ చైర్మన్ అయిన నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగుతారని, మూడు నెలల్లోగా జిల్లా కోర్టులో కేసు పరిష్కారం చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. తాజా వ్యవహారంతో మళ్లీ మొదటికి.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశంతో జెడ్పీ అధికారులు, జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జెడ్పీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ బాధ్యతలు చేపట్టడంతోపాటు ఈనెల 1న జెడ్పీ చైర్మన్ బంగ్లాలోకి అధికారికంగా మారి 8న సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈదర హరిబాబు మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం ఆయన పిటీషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీంతో జెడ్పీటీసీగా కొనసాగే అవకాశం ఈదర హరిబాబుకు లభించినట్లయింది. జెడ్పీ చైర్మన్‌గా కూడా ఆయనకే అవకాశం ఉంటుందా లేదా అనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
ప్రకాశం జెడ్పీ వైస్ చైర్మనే.. చైర్మన్
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జెడ్పీ వ్యవహారంలో హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రకాశం జెడ్పీ చైర్మన్ బాధ్యతలను వైస్ చైర్మనే నిర్వర్తిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యునిగా, జెడ్పీ చైర్మన్‌గా తనపై పడ్డ అనర్హత వేటు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈదర హరిబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను 3 నెలల్లో పరిష్కరించాలని కింది కోర్టును ధర్మాసనం ఆదేశించింది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై దాఖలైన వివిధ పిటిషన్లను, అప్పీళ్లను వాదనలు విని ఇటీవల తన నిర్ణయాన్ని వాయిదా వేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీనే చైర్మన్‌గా విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తూ, ఈ అప్పీళ్లపై తుది విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. -
వైస్చైర్మన్నే చైర్మన్‌గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ప్రకాశం జడ్పీ చైర్మన్ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు వైస్ చైర్మన్‌ను చైర్మన్‌గా కొనసాగించాలని హైకోర్టు ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈదర హరిబాబు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై మూడు నెలల్లోగా విచారణ ముగించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. విఫ్ దిక్కారించారంటూ తనపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈదర హరిబాబు గతంలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. దీంతో ఈదర హరిబాబు జడ్పీ చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించారు. దీన్ని సవాలు చేస్తూ టిడిపి విప్ నర్సింహం హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు రిట్ అప్పీల్ చేశారు. రిట్ అప్పీల్‌ను పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్‌నే జడ్పీ చైర్మన్‌గా కొనసాగించాలని ఆదేశించింది. ** -
హైకోర్టు తీర్పు ఇచ్చినా...సహకరించటం లేదు: ఈదర
ఒంగోలు : టీడీపీ బహిష్కృత నేత, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు గురువారం తన చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తాను వచ్చేసరికే చాంబర్‌కు తాళాలు వేసి ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. జెడ్పీ చైర్మన్‌గా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా సీఈవో సహకరించటం లేదని ఈదర ఆవేదన చెందారు. తనకు న్యాయం జరిగేవరకూ కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
బాధ్యయతలు తీసుకున్న ఈదర హరిబాబు