వైస్చైర్మన్నే చైర్మన్గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ప్రకాశం జడ్పీ చైర్మన్ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు వైస్ చైర్మన్‌ను చైర్మన్‌గా కొనసాగించాలని హైకోర్టు ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈదర హరిబాబు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై మూడు నెలల్లోగా విచారణ ముగించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. విఫ్ దిక్కారించారంటూ తనపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈదర హరిబాబు గతంలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
దీంతో ఈదర హరిబాబు జడ్పీ చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించారు. దీన్ని సవాలు చేస్తూ టిడిపి విప్ నర్సింహం హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు రిట్ అప్పీల్ చేశారు. రిట్ అప్పీల్‌ను పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్‌నే జడ్పీ చైర్మన్‌గా కొనసాగించాలని ఆదేశించింది.
**