
హైకోర్టులో హరిబాబు అప్పీల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌గా తన విధులు నిర్వర్తించే విషయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సింగిల్ జడ్జి నిరాకరించారంటూ ఈదర హరిబాబు దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం కొట్టేసింది. ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.