prapurna
-
సేవా ప్రపూర్ణ
సోమాజిగూడ: పేదల కష్టాలు చూసి చలించిన ఆమె... వారిని ఆదుకునేందుకు ఆశ్రి సొసైటీ ఏర్పాటు చేసింది. వృద్ధులను చేరదీసి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తోంది. 25 మంది విద్యార్థులను చేరదీసి ఆశ్రయం కల్పించి, విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. ఆమే ప్రపూర్ణ. ‘మా ఊరు ఖమ్మం దగ్గరి కల్లూరు. ఎన్విరాన్మెంట్ సైన్స్‌లో పట్టా తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ. నేను స్కూలుకు వెళ్తుంటే కొందరు పిల్లలు మట్టిలో ఆడుకోవడం చూసి, వాళ్లూ నాలా చదువుకుంటే బాగుంటుంది కదా అనిపించేంది. అయితే వారు తినడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చదువు ఎలా సాగుతుంది? ఆ ఆలోచనలతోనే ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. చదువు కొనసాగిస్తూ, నా ఆలోచనలతో 2014లో ఆశ్రి సొసైటీకి అంకురార్పణ చేశాను’ అని వివరించింది ప్రపూర్ణ. 25 మందికిచేయూత... ప్రపూర్ణ 25 మంది పిల్లలను చేరదీసి బొల్లారంలోని ఆశ్రి సొసైటీ హోమ్‌లో ఆశ్రయం కల్పిస్తోంది. వీరి ఆలనాపాలనా మొత్తం చూసుకుంటోంది. స్కూల్లో చేర్చి విద్యనందిస్తోంది. రోడ్డుపక్కన ఉండే వృద్ధులను చేరదీసి, అనాథాశ్రమాలకు పంపిస్తోంది. అదే విధంగా ప్రతిఏటా పేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందజేస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ను వృత్తిగా ఎంచుకున్న ప్రపూర్ణ... ఆ ఆదాయంతోనే ఈ సేవలు చేస్తోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పింది. రక్తదానం చేయడమే కాకుండా... ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తోంది. చిన్నతనంలోనే సేవామార్గంలో నడుస్తోన్న ప్రపూర్ణ మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది. -
చిలకమర్తికి ’జ్యోతిష ప్రపూర్ణ’
ఘనంగా మందేశ్వరస్వామి మహాత్మ్యం పుస్తకావిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్ : మందపల్లి శనీశ్వరస్వా మి దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త, తొలి ఆంగ్లపంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర శర్మ జ్యోతిష రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ’జ్యోతిష ప్రపూర్ణ’ బిరుదును అందుకున్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన సమావేశంలో మందేశ్వరదేవస్థానం ఛైర్మ¯ŒS బండారు సూర్యనారాయణమూర్తి, ఈఓ వెచ్చా దేవు ళ్లు, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి, ఇతర అతిథుల చేతులమీదుగా చిలకమర్తి ప్రభాకర శర్మ ఈ బిరుదాన్ని అందుకున్నారు. ఎం.టెక్, ఎంబీయే చదివిన చిలకమర్తి భద్రాచలం దేవస్థానంలో జ్యోతిష విద్యను నేర్చుకుని తెలుగు, ఆంగ్ల భాషలలో ఏటా పంచాంగాలు వెలువరిస్తున్నారు. శ్రీ మందేశ్వరస్వామి మహాత్మ్యం పుస్తకావిష్కరణ ’శనిదేవుని గురించి ప్రజలలో ఉన్న అపోహలు దూరం చేయడానికి ఈ పుస్తకం రచించాను అని గ్రంథకర్త చిలకమర్తి తెలిపారు. ఆయన తెలుగు, ఆంగ్ల భాషలలో రచించిన ’శ్రీమందేశ్వరస్వామి మహాత్మ్యం’ పుస్తకాన్ని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. శనిగ్రహ పీడితులు ఉపశమనం పొందడానికి స్థలపురాణంతో పాటు శని స్తోత్రాలను పుస్తకంలో పొందుపరిచామన్నారు. గ్రంథ సమీక్ష చేసిన కవి, గాయకుడు ఎర్రా‡ప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ శనిదశలో ఉన్నవారి భయాందోళనలను ఈ పుస్తకం దూరం చేస్తుందని తెలిపారు. మందపల్లి దేవస్థానం ఛైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తి, కార్యనిర్వహణాధికారి వెచ్చా దేవుళ్లు, ఇతర ప్రముఖులు గ్రంథకర్తను సత్కరించారు. కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి, బీజేపి నాయకులు వీరన్నచౌదరి తదితరులు పాల్గొన్నారు