చిలకమర్తికి ’జ్యోతిష ప్రపూర్ణ’ | jyothisha prapurna award | Sakshi
Sakshi News home page

చిలకమర్తికి ’జ్యోతిష ప్రపూర్ణ’

Published Wed, Nov 2 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

చిలకమర్తికి ’జ్యోతిష ప్రపూర్ణ’

చిలకమర్తికి ’జ్యోతిష ప్రపూర్ణ’

ఘనంగా  మందేశ్వరస్వామి మహాత్మ్యం పుస్తకావిష్కరణ
రాజమహేంద్రవరం కల్చరల్‌ : మందపల్లి శనీశ్వరస్వా మి దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త, తొలి ఆంగ్లపంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర శర్మ జ్యోతిష రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ’జ్యోతిష ప్రపూర్ణ’ బిరుదును అందుకున్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన సమావేశంలో మందేశ్వరదేవస్థానం ఛైర్మ¯ŒS బండారు సూర్యనారాయణమూర్తి, ఈఓ వెచ్చా దేవు ళ్లు, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి, ఇతర అతిథుల చేతులమీదుగా చిలకమర్తి ప్రభాకర శర్మ ఈ బిరుదాన్ని అందుకున్నారు. ఎం.టెక్, ఎంబీయే చదివిన చిలకమర్తి భద్రాచలం దేవస్థానంలో జ్యోతిష విద్యను నేర్చుకుని తెలుగు, ఆంగ్ల భాషలలో ఏటా పంచాంగాలు వెలువరిస్తున్నారు.
శ్రీ మందేశ్వరస్వామి మహాత్మ్యం పుస్తకావిష్కరణ
’శనిదేవుని గురించి ప్రజలలో ఉన్న అపోహలు దూరం చేయడానికి ఈ పుస్తకం రచించాను అని గ్రంథకర్త చిలకమర్తి తెలిపారు. ఆయన  తెలుగు, ఆంగ్ల భాషలలో రచించిన ’శ్రీమందేశ్వరస్వామి మహాత్మ్యం’ పుస్తకాన్ని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. శనిగ్రహ పీడితులు ఉపశమనం పొందడానికి స్థలపురాణంతో పాటు శని స్తోత్రాలను పుస్తకంలో పొందుపరిచామన్నారు. గ్రంథ సమీక్ష చేసిన కవి, గాయకుడు ఎర్రా‡ప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ శనిదశలో ఉన్నవారి భయాందోళనలను ఈ పుస్తకం దూరం చేస్తుందని తెలిపారు. మందపల్లి దేవస్థానం ఛైర్మన్‌  బండారు సూర్యనారాయణమూర్తి, కార్యనిర్వహణాధికారి వెచ్చా దేవుళ్లు, ఇతర ప్రముఖులు గ్రంథకర్తను సత్కరించారు. కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి, బీజేపి నాయకులు వీరన్నచౌదరి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement