Prasad Lab
-
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `గ్రే`. ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఈ సినిమా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ `గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మనలైఫ్‌లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి.ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం`అన్నారు. `రాజ్ ముదిరాజ్ మంచి ప్రతిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను`అన్నారు ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. నిర్మాత కిరణ్ కల్లాకురి మాట్లాడుతూ..`ఈ సినిమా కోసం రాజు, రమేష్చదలవాడ చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు పెట్టడం సులువే. కానీ మంచి అవుట్‌పుట్ ఇవ్వడం కష్టం. గ్రే మంచి సినిమా అవుతుందని నమ్ము తున్నాను. థ్రిల్లర్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్లర్ మూవీ`అన్నారు. -
'అజాత శత్రువు' వెబ్ సిరీస్ టీజర్ లాంచ్ ఫోటోలు..
-
రాడాన్ లఘు చిత్ర అవార్డుల ప్రదానం
రాడాన్ లఘు చిత్రాల అవార్డుల వేడుక బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.జాతీయ,అంతర్జాతీయ స్థాయికి చెందిన పలు లఘు చిత్రాలు పోటీలో పాల్గొనడం విశేషం. నటి రాధిక శరత్‌కుమార్ కూతురు రెయాన్ నిర్వహించిన ఈ లఘు చిత్ర పోటీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.ఈ పోటీలో దర్శకుడు వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహించిన ఓడమ్ అనే లఘు చిత్రం టైటిల్ విన్నర్‌గా నిలిచింది.దీనికి రూ 1.5 లక్షల నగదు బహుమతిని అందించారు.కాగా అంజలి పద్మనాభన్ దర్శకత్వం వహించిన నిళల్ షార్ట్ ఫిలిం రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుంది. దీనికి 75 వేల నగదు బహుమతిని అందించారు. వీటితో పాటు జీకే దర్శకత్వం వహించిన అస్సారి చిత్రం, వివేక్ మనో తడై,అంజలి ఇరుదివరై చిత్రాలు వరుసగా ప్రధమ,ద్వితీయ,తృతీయ అవార్డులను గెలుచుకున్నాయి.ఈ కార్యక్రమంలో నటుడు శరత్‌కుమార్,రాధిక శరత్‌కుమార్,దర్శకుడు కే. భాగ్యరాజ్,కార్తీక్ సుబ్బరాజ్, నటుడు ఆర్య,సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సినీ ప్రముఖులు పాల్గొని విజేతలకు అవార్డులను అందించారు.ఆ పోటీల్లో అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకులను సినీ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకురాలు రెయాన్ వెల్లడించారు.