రాడాన్ లఘు చిత్రాల అవార్డుల వేడుక బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.జాతీయ,అంతర్జాతీయ స్థాయికి చెందిన పలు లఘు చిత్రాలు పోటీలో పాల్గొనడం విశేషం. నటి రాధిక శరత్‌కుమార్ కూతురు రెయాన్ నిర్వహించిన ఈ లఘు చిత్ర పోటీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.ఈ పోటీలో దర్శకుడు వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహించిన ఓడమ్ అనే లఘు చిత్రం టైటిల్ విన్నర్‌గా నిలిచింది.దీనికి రూ 1.5 లక్షల నగదు బహుమతిని అందించారు.కాగా అంజలి పద్మనాభన్ దర్శకత్వం వహించిన నిళల్ షార్ట్ ఫిలిం రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుంది.
దీనికి 75 వేల నగదు బహుమతిని అందించారు. వీటితో పాటు జీకే దర్శకత్వం వహించిన అస్సారి చిత్రం, వివేక్ మనో తడై,అంజలి ఇరుదివరై చిత్రాలు వరుసగా ప్రధమ,ద్వితీయ,తృతీయ అవార్డులను గెలుచుకున్నాయి.ఈ కార్యక్రమంలో నటుడు శరత్‌కుమార్,రాధిక శరత్‌కుమార్,దర్శకుడు కే. భాగ్యరాజ్,కార్తీక్ సుబ్బరాజ్, నటుడు ఆర్య,సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సినీ ప్రముఖులు పాల్గొని విజేతలకు అవార్డులను అందించారు.ఆ పోటీల్లో అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకులను సినీ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకురాలు రెయాన్ వెల్లడించారు.
రాడాన్ లఘు చిత్ర అవార్డుల ప్రదానం
Published Fri, Mar 11 2016 3:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement